Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

జయలలిత. అన్నట్లుగానే గెలిచారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే అవమానం, మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు అదే పరిస్థితి.

Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

Cms Oth

Chandrababu: నిండు సభలో పాండవుల సతీమణికి జరిగిన అవమానం.. మరోసారి నాకు జరిగింది సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశారు జయలలిత. అన్నట్లుగానే గెలిచారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే అవమానం, మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు అదే పరిస్థితి.

జయలలిత శపథం:
1989వ సంవత్సరం త‌మిళ‌నాడు ముఖ్యమంత్రిగా క‌రుణానిధి ఉన్న సమయంలో బ‌డ్జెట్ ప్ర‌సంగం జరుగుతుంది. ‘మీవ‌న్నీ త‌ప్పుడు హ‌మీలు. తప్పుడు లెక్క‌లంటూ’ ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కురాలైన జ‌య‌ల‌లిత ఆ ప్ర‌సంగాన్ని అడ్డుకుంటూ నిరసనకు దిగారు. ‘డి.ఎం.కె’ పార్టీ కార్యకర్తలు జ‌య‌ల‌లితపై దాడి చేశారు. ఆ సమయంలో చిరిగిన చీర‌తో అసెంబ్లీని వదిలి వెళుతూ….. మళ్ళీ ముఖ్య‌మంత్రిగానే ఈ స‌భ‌లో అడుగుపెడ‌తాను’ అంటూ శ‌ప‌థం చేశారు జ‌య‌ల‌లిత‌.

ఆమె అలా శపథం చేసినట్టుగానే 1991 ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత నాయ‌క‌త్వంలోని ‌’ఏ.ఐ.ఏ.డి.ఎం.కె’ పార్టీ… 234 సీట్ల‌కు 225 సీట్ల‌ను గెలిచి అధికారంలోకి రావడం విశేషం.

జగన్ శపథం:
గతంలో వైఎస్సార్సీపీ పలుమార్లు ఏపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. స్పీకర్ తీరుపై వైఎస్ జగన్ తన పార్టీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేసేవారు. బడ్జెట్‌పై మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయటం వంటి ఘటనలు జరిగాయి. స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు అవ‌కాశం లేని స‌భ త‌న‌కు అవ‌స‌రం లేదంటూ… 2015, మార్చి 19న వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

పాదయాత్ర చేపట్టి.. ప్రజాదరణ పొంది 30మే 2019గా ప్రమాణం స్వీకారం చేసి 175కి గానూ 151 గెలిచి సీఎంగా అడుగుపెట్టారు.

చంద్రబాబు శపథం:
2021 నవంబర్ 11న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారు. ఓటమి తర్వాత నుంచి వ్యక్తిగత విమర్శలు భరిస్తూ వచ్చిన ఆయన సతీమణిపై చేసిన విమర్శలు తట్టుకోలేకపోయారు. రెండున్నరేళ్లుగా అసెంబ్లీలో మాట్లాడేందుకు కొద్ది పాటి అవకాశం లభించినా పదే పదే సభ్యులు అడ్డుతగులుతుండటంతో మనోవేదనకు గురయ్యారు.

కంటనీరు అదుపుచేసుకుంటూ.. ముఖ్యమంత్రిగానే సభలోకి తిరిగొస్తానని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై టీడీపీ భవితవ్యం ఆధారపడి ఉంది.