భోజనాల దగ్గరే ఇగోలు : పెళ్లి పీటలపై నుంచే విడాకులకు అప్లయ్
అప్పుడే పెళ్లైంది. పెళ్లి తంతు పూర్తికాగానే.. గ్రాండ్ గా వెడ్డింగ్ పార్టీ అరెంజ్ చేశారు. ఇంకా పెళ్లి పందిరి తీయనేలేదు. వచ్చిన చుట్టాలు పోనే పోలేదు. పెళ్లికి వచ్చిన అతిథులంతా వధువరులకు విషెస్ చెబుతున్నారు.

అప్పుడే పెళ్లైంది. పెళ్లి తంతు పూర్తికాగానే.. గ్రాండ్ గా వెడ్డింగ్ పార్టీ అరెంజ్ చేశారు. ఇంకా పెళ్లి పందిరి తీయనేలేదు. వచ్చిన చుట్టాలు పోనే పోలేదు. పెళ్లికి వచ్చిన అతిథులంతా వధువరులకు విషెస్ చెబుతున్నారు.
అప్పుడే పెళ్లైంది. గ్రాండ్ గా వెడ్డింగ్ పార్టీ అరెంజ్ చేశారు. ఇంకా పెళ్లి పందిరి తీయనేలేదు. వచ్చిన చుట్టాలు పోనే పోలేదు. పెళ్లికి వచ్చిన అతిథులంతా వధువరులకు విషెస్ చెబుతున్నారు. ఇంతలో మధ్యాహ్నం అయింది.. లంచ్ టైమ్.. పెళ్లికొడుకు, పెళ్లికూతురికి బాగా ఆకలేస్తుంది. చక్కగా ముస్తాబై డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొన్నారు. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన కొత్త దంపతులు సడన్ గా ఫైర్ అయ్యారు.
ఏమైందో ఏమో తెలియదు.. కస్సుబుస్సు మన్నారు. అంతటితో ఆగలేదు. డైనింగ్ టేబుల్ పై నుంచి ఒక్కసారిగా పైకిలేచి కుర్చీలు, తినే కంచాలు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. నానా రచ్చ చేశారు. తొలుత ఫన్నీ ఫైట్ అనుకున్న అతిథులంతా రియల్ ఫైట్ అని తెలిసి అవాక్కయ్యారు. పెళ్లికి వచ్చిన బంధువులు, వధువు వరుడి తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినలేదు. ఫైట్ పీక్స్ కు వెళ్లింది.
పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. అయినా ఫలితం లేదు. మొగడు పెళ్లాల మధ్య పోలీసులేంటి.. పక్కంటోడు వచ్చిన ముఖం పచ్చడి కావాల్సిందే. ఇంకేముంది.. పెళ్లి అయిన ఆ కొత్త జంట.. అక్కడే బ్రేకప్.. బ్రేకప్.. అంటూ విడాకులకు సిద్ధమయ్యారు. విడాకులు నేను ఇస్తానంటే.. లేదు.. నువ్వు ఇచ్చేది ఏంటి.. నేనే ముందు ఇస్తానంటూ రచ్చ రంబోలా చేశారు. ఇద్దరు తలో లాయర్ ను పిలిపించి విడాకులకు అప్లయ్ చేశారు.
సినిమా సీన్ ను తలపించేలా ఉన్న ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. పెళ్లి అయిన రోజే విడాకులకు సిద్ధపడిన నూతన దంపతులను చూసి వారి తల్లిదండ్రులు ఎలా నచ్చజేప్పాలో అర్థం కాక తలలు పట్టేసుకున్నారు. పెళ్లి కూతురును వెంట తీసుకెళ్లకుండానే పెళ్లికొడుకు ఇంటికి వెళ్లిపోయాడు. పెళ్లిలో వధువు తరపు నుంచి వచ్చిన గిఫ్ట్ లను కూడా అక్కడే తిరిగి ఇచ్చేశాడట.