Vijay Rupani: అహ్మదాబాద్‌‌లో విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఈనెల 12న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Former Gujarat CM Vijay Rupani

Ahmedabad plane crash: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఈనెల 12న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై పడి పేలిపోయింది.

Also Read: WTC Final: బుద్ధి మార్చుకోని ఆసీస్‌.. ఓటమి భయంతో చెత్త మాటలు.. గట్టి గుణపాఠం చెప్పి సఫారీ జట్టు..

ఈ ఘోర విమాన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితోపాటు విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవన్ పై కూలడంతో 33 మంది మెడికోలు చనిపోయారు. దీంతో విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కు చేరింది. ప్రమాదంలో మృతులను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాణీ మృతదేహాన్ని గుర్తించారు.

విమాన ప్రమాదంలో విజయ్ రూపాణి కూడా మృతి చెందాడు. ప్రమాదం జరిగిన మూడు రోజుల తరువాత ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. ఇదిలాఉంటే.. ఇప్పటి వరకు 32 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు వైద్యులు తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. వైద్యుల బృందం చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహిస్తున్నారు.