గుజరాత్ మాజీ సీఎం మృతికి.. ఆయన అదృష్ట సంఖ్యతో సంబంధం ఏమిటి..? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన మరణంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది..

Vijay Rupani

Vijay Rupani: గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది చనిపోయారు. వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మృతిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Also Read: Vijay Rupani: ఇప్పుడు విజయ్ రుపానీ.. అప్పుడు కొడుకు.. గుజరాత్ మాజీ సీఎం కుటుంబాన్ని వెంటాడుతున్న ‘శాపం’..

విజయ్ రూపానీ “1206” సంఖ్యను తన అదృష్ట సంఖ్యగా భావించేవారు. ఆయ‌న ప‌ర్స‌న‌ల్ వెహిక‌ల్స్ అన్నింటికీ అదే నంబ‌ర్ ఉండేది. అయితే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఆయన మరణంకు.. ఆయన అదృష్ట సంఖ్యకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎలా అంటే..? విజయ్ రూపానీ వాహనాలన్నింటి నంబర్ ప్లేట్లలో 1206 అని ఉంది. ఆయన లండన్ వెళ్లే విమానంలో ఆయన సీటు నంబర్ 12, ఆయన బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12:10, ప్రమాదం జరిగిన రోజు 12-06 కావటం గమనార్హం. దీంతో అదృష్ట సంఖ్యే ఆయ‌న‌కు దుర‌దృష్ట‌క‌రంగా మారింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు

భాజపాకు చెందిన విజయ్‌ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 68ఏళ్ల విజయ్‌ రూపానీ అసలు పేరు విజయ్‌భాయ్‌ రామ్‌నిక్‌లాల్‌భాయ్‌ రూపానీ. ఆయన 1956 ఆగస్టు 2వ తేదీన మయన్మార్‌లోని యాంగూన్‌లో జన్మించారు. రూపానీకి భార్య అంజలి, కుమారుడు రుషబ్, కుమార్తె రాధిక ఉన్నారు. మరో కుమారుడు పూజిత్‌ రూపానీ గతంలో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. లండన్‌లో ఉంటున్న తన భార్య, కూతురిని చూసేందుకు విజయ్ రూపానీ వెళ్తున్నారు. గత 6 నెలలుగా ఆయన సతీమణి లండన్‌లోనే ఉంటున్నారు. ఆమెని ఇండియాకి తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది.