Vijay Rupani: ఇప్పుడు విజయ్ రుపానీ.. అప్పుడు కొడుకు.. గుజరాత్ మాజీ సీఎం కుటుంబాన్ని వెంటాడుతున్న ‘శాపం’..

ఇప్పుడు విజయ్ రుపానీ కూడా విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Vijay Rupani: ఇప్పుడు విజయ్ రుపానీ.. అప్పుడు కొడుకు.. గుజరాత్ మాజీ సీఎం కుటుంబాన్ని వెంటాడుతున్న ‘శాపం’..

Updated On : June 12, 2025 / 7:22 PM IST

Vijay Rupani: అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో అందరూ చనిపోయినట్టేనని నగర సీపీ ప్రకటించారు. దీంతో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టేనని అధికారికంగా తెలియజేసినట్టయింది. ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో విజయ్ రుపానీ కూడా ఉన్నారు. ఆయన బిజినెస్ క్లాస్ పరిధిలోకి వచ్చే జెడ్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం క్రాష్ అయింది. ఓ మెడికల్ కాలేజీ డాక్టర్స్ హాస్టల్ భవనం మీద పడింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది చనిపోయారు.

ఎవరీ విజయ్ రుపానీ?
విజయ్ రుపానీ గుజరాత్ కి 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956 ఆగస్ట్ 2న విజయ్ రుపానీ జన్మించారు. బీజేపీలో సీనియర్ నేత. రెండుసార్లు సీఎంగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకు సుమారు ఐదేళ్ల పాటు ఆయన సీఎం పదవిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ కోట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన విజయ్ రుపానీ 1996 – 1997 మధ్య తొలిసారి పదవిని చేపట్టారు. రాజ్ కోట్ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత వేగంగా పార్టీలో గుర్తింపు లభించింది. 2006 నుంచి 2016 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో తొలిసారి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలిసారి ఎన్నికైనా మంత్రి పదవి లభించింది. ఆ తర్వాత 2016లో మారిన రాజకీయ సమీకరణాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అండతో ఏకంగా సీఎం అయ్యారు. 2016 నుంచి 2021 వరకు సీఎంగా కొనసాగారు. మధ్యలో 2016లో కొంతకాలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

Also Read: విమాన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే పరిహారం ఎవరిస్తారు? విమాన కంపెనీలా? ఇన్సూరెన్స్ కంపెనీలా? ఎంత ఇస్తారు?

విజయ్ రుపానీకి భార్య, ఇద్దరు పిల్లలు. వారిలో చిన్న కొడుకు పుజిత్ గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతడి పేరు మీద పుజిత్ మెమోరియల్ ట్రస్ట్ నెలకొల్పి సమాజ సేవ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ రుపానీ కూడా విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లండన్ లో ఉంటున్న తన భార్య, కూతురిని చూసేందుకు విజయ్ రూపానీ వెళ్తున్నారు. గత 6 నెలలుగా ఆమె లండన్ లోనే ఉంటున్నారు. ఆమెని ఇండియాకి తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది.