యుద్ధ విమానం జాగ్వార్ కూలిపోయింది

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. ఉత్తరప్రదేశ్ రాజధానికి 322 కిలోమీటర్ల దూరంలోని  కుషినగర్ లో ఇవాళ(జనవరి 28, 2019) విమానం క్రాష్ అయింది. పంటపొలాల్లో విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి పూర్తిగా విమానం కాలిపోయింది.

 

ఈ ప్రమాదం నుంచి ప్యారాచూట్ సాయంతో  పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. గోరఖ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి ఈ యుద్ధ విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదనియ అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. 

 

అయితే ఏడాది కాలంలో జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోవడం ఇది రెండోసారి. గతేడాది జూన్ లో కూడా జామ్ నగర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన జాగ్వార్ యుద్ధ విమానం కొద్ది సేపటికే క్రాష్ అయిన విషయం తెలిసిందే.