Air India Saree : ఎయిరిండియా చీర, ప్యాంట్ యూనిఫాం అంట.. పిచ్చ తిట్లు తిడుతున్న నెటిజన్లు

మహిళా క్యాబిన్ సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండేందుకు రూపొందించిన ఈ యూనిఫాంలో ప్యాంటుతో జతచేసిన రెడీ టు వేర్ చీర, బోట్ నెక్ జాకెట్ ఉన్నాయి.

Air India Saree Pant Uniform

Air India Saree Pant Uniform : టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది కోసం తయారు చేసిన యూనిఫాంపై నెట్టింట్లో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది కోసం ‘చీర- ప్యాట్’ శైలిలో సరికొత్త యూనిఫాంను డిజైన్ చేశారు. ఆ డిజైన్ భారతీయ సంప్రదాయాలను కించపర్చేదిలా ఉందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Also Read: Vadodara Woman : వార్నీ.. పానీపూరీ కోసం ఇదేంది తల్లీ.. నడిరోడ్డుపై రచ్చరచ్చ.. వీడియో వైరల్.. రంగంలోకి పోలీసులు.. అసలేం జరిగిందంటే?

ముంబైకు చెందిన బీజేపీ మహిళా నేత ఒకరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందికోసం తయారు చేసిన యూనిఫాంపై కీలక కామెంట్స్ చేశారు. ‘ఛీ.. ఇది రెండు పడవల మీద ఉండటానికి ప్రయత్నించి కింద పడటం లాంటిది. చీరలోని సొగసు కాదు, ప్యాంటులోని స్మార్ట్‌నెస్ కూడా కాదు..’ అని ఆమె అన్నారు.

మహిళా క్యాబిన్ సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండేందుకు రూపొందించిన ఈ యూనిఫాంలో ప్యాంటుతో జతచేసిన రెడీ టు వేర్ చీర, బోట్ నెక్ జాకెట్ ఉన్నాయి. ఈ యూనిఫాం పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. మనీష్ మల్హోత్రా ఎయిర్ ఇండియాను, ఆ సంస్థ కస్టమర్లను కించపర్చినట్లుగా ఉంది. అతనికి చీర పట్ల అసహ్యం ఉంది కాబోలు.. ఏదైనా సరే.. ఇది మాత్రం దారుణం అని పేర్కొన్నాడు.
మరో నెటిజన్ స్పందిస్తూ.. యూనిఫాంలో చీర, ప్యాంటు కలయిక విచిత్రమైనదిగా ఉంది.

మనీష్ మల్హోత్రా ఎయిర్ ఇండియా సిబ్బందికోసం రూపొందించిన ఈ కొత్త “చీర-ప్యాంట్” దుస్తులు భారతీయతకు, హిందూ సంప్రదాయానికి అవమానం. ఇది భారతీయ సంస్కృతి, గౌరవానికి ఏమాత్రం సరిపోదు. ఇది డిజైన్ కాదు, కానీ మన సాంస్కృతిక వారసత్వాన్ని వక్రీకరించే పేలవమైన ప్రయత్నం. కోట్లాది రూపాయల ఖర్చుతో తయారు చేయబడిన ఈ డిజైన్ ఆకర్షణీయంగా లేదు. భారతీయ సంప్రదాయాన్ని గౌరవించదు. భారతీయ మహిళల గర్వం చీర-ప్యాంట్ కాదు, చీర. మనీష్ మల్హోత్రా, ఎయిర్ ఇండియా వెంటనే ఈ తప్పును సరిదిద్దాలని సూచించారు.