ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం పరిసరాల్లో ఎయిర్ క్వాలిటీ తీవ్రస్థాయిలో ఉన్నట్లు నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(NAQI),సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపింది. నోయిడాలో కూడా తీవ్రస్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఉన్నట్లు తెలిపింది.
పక్క రాష్ట్రాలైన హర్యాణ,పంజాబ్ లలో పంటలు తగులబెట్టడం కారణంగా వస్తున్న పొగే దీనికి కారణమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఏడాది పంటల తగులబెట్టుట గత ఏడాదితో్ పోలిస్తే రెట్టింపు అయిందని ఆయన తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారన్నారు.
రిలీఫ్ కోసం ప్రభుత్వ,ప్రైవేట్ స్కూళ్లలోని ప్రతి ఒక్క విద్యార్థికి 2మాస్క్ లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. నవంబర్ 04వ తేదీ నుంచి సరి – బేసీ విధానం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Delhi: Air quality in ‘Severe’ category in areas around Major Dhyan Chand National Stadium and India Gate, according to Central Pollution Control Board pic.twitter.com/Wm7wrgbCWx
— ANI (@ANI) 1 November 2019