Flight Ticket : శుభవార్త .. లగేజీ లేకుంటే విమాన టికెట్ మరింత చౌక!

విమాన టికెట్లు చౌకగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణికులకు, వారి లగేజీకి విడివిడిగా టికెట్లు తీసుకొచ్చేందుకు విమానయాన సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Flight Ticket

Flight Ticket :  విమాన టికెట్లు చౌకగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణికులకు, వారి లగేజీకి విడివిడిగా టికెట్లు తీసుకొచ్చేందుకు విమానయాన సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. లగేజీ లేని ప్రయాణికులకు టికెట్ ధర తగ్గించాలని విమానయాన సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం చెక్‌ఇన్ లగేజీ విభాగాన్ని విడదీసే యత్నాల్లో సంస్థలున్నాయి.

చదవండి : Flight Charges: భారీగా పెరిగిన విమాన చార్జీలు..!

ప్రయాణికుల టికెట్ ధరలు తగ్గించి, చెక్‌ఇన్ లగేజీ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతున్నాయి, ఇక ఈ నేపథ్యంలోనే విమానయాన సంస్థలు 100 శాతం సామర్థ్యంతో సర్వీసులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.

చదవండి : Smoking in flight : విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తి అరెస్ట్

అయితే లగేజీ లేని ప్రయాణికులకు ప్రత్యేక ఛార్జీలు నిర్ణయించవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవిటయేషన్ ఫిబ్రవరిలోనే తెలిపింది. ప్రయాణికుడికి, అతడి లగేజీకి విడివిడిగా ఛార్జ్ చెయ్యొచ్చని స్పష్టం చేసింది. అయితే సర్వీసులు పునఃప్రారంభమయ్యాక ఛార్జీలు, సీటింగ్‌ సామర్థ్యంపై పరిమితులు విధించడంతో తదుపరి కూడా నిర్ణయం తీసుకోలేకపోయినట్లు ఇండిగో సీఈఓ రోనోజాయ్‌ దత్తా పేర్కొన్నారు.

ఈ విధానంపై తమకు సానుకూల దృక్పథమే ఉందని.. ఛార్జీల విభజనతో బ్యాగేజీ లేనివారికి టికెట్‌ ధరలు మరింత కిందకు దిగివస్తాయి దత్తా తెలిపారు.