Bollywood Corona : ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రాయ్, ఆరాధ్య

  • Published By: madhu ,Published On : July 18, 2020 / 06:12 AM IST
Bollywood Corona : ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య రాయ్, ఆరాధ్య

Updated On : July 18, 2020 / 11:41 AM IST

భారత దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. పలువురు సెలబ్రెటీలకు కరోనా పాజిటివ్ రావడంతో కొంతమంది హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోగా..మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బాలీవుడ్ Big B అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కరోనా సోకడం సంచలనం రేకేత్తించింది. తొలుత అమితాబ్, అభిషేక్ బచ్చన్ లను ఆసుపత్రికి తరలించారు. అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్, మనువరాలు ఆరాధ్యలు ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. తాజాగా వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

ముంబైలోని నానావతి ఆసుపత్రిలో వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ వచ్చాయి. దీంతో స్వీయ క్వారంటైన్ లో ఉండిపోయారు. కానీ..ప్రస్తుతం వైద్యుల అవసరం ఉండడంతో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇప్పుడు తల్లి కూతురు క్షేమంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.