గుడ్ న్యూస్ : కరోనా నెగిటివ్ అని తేలడంతో చైనా నుంచి వచ్చిన 406మంది భారతీయులు ఇంటికి

హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 12:53 PM IST
గుడ్ న్యూస్ : కరోనా నెగిటివ్ అని తేలడంతో చైనా నుంచి వచ్చిన 406మంది భారతీయులు ఇంటికి

Updated On : February 16, 2020 / 12:53 PM IST

హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు

హమ్మయ్య.. గండం గడిచింది. టెన్షన్ తొలగింది. నిర్భందం తప్పింది. ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చు. చైనా నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులకు ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు అధికారులు. ఇంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న 406మందికి కరోనా లేదని టెస్టుల్లో తేలింది. నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఇంటికి వెళ్లేందుకు వారందరికి అనుమతి ఇచ్చారు. సోమవారం(ఫిబ్రవరి 17,2020) వారిని డిశ్చార్జ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.

ఇటీవలే చైనాలోని వూహాన్(wuhan) నగరం నుంచి 406 మంది భారతీయులను భారత్ తీసుకొచ్చారు. వారందరిని ఢిల్లీలో ఓ గదిలో ఉంచారు. కరోనా వైరస్(covid-19) పరీక్షలు నిర్వహించారు. వారి నమూనాలు సేకరించారు. దీనికి సంబంధించిన తుది రిపోర్టు వచ్చింది. అందులో నెగిటివ్ అని తేలింది. రెండుసార్లు నమూనాలు పరీక్షించిన తర్వాత కూడా నెగిటివ్ అని రావడంతో.. అందరిని డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు.

మనేసర్, ఐటీబీపీ క్యాంపుల్లో 654మందికి పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులో నెగిటివ్ అని వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం మూడు కరోనా కేసులు మాత్రమే నమోదైనట్టు మంత్రి చెప్పారు. వూహాన్ నుంచి కేరళకు వచ్చిన విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయన్నారు. ఇప్పటికే ముగ్గురిలో ఒక విద్యార్థి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని చెప్పారు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

కరోనా వైరస్(corona virus) చైనాలో విజృంభించిన తర్వాత.. అక్కడ ఉన్న భారతీయులను ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. అక్కడి నుంచి తీసుకొచ్చిన భారతీయుల కోసం.. మనేసర్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంపుల్లో క్వారంటైన్ విభాగాలు ఏర్పాటు చేసింది. వారందరిని అక్కడ ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విమాన సర్వీసులు ఏర్పాటు చేసింది.

చైనా నుంచి వచ్చిన వెంటనే.. స్పెషల్ డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో ఉంచుతారు. వారిలో ఇన్ ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపుతారు. నెగిటివ్ అని వస్తే ఇంటికి పంపిస్తారు. ఎయిర్ ఇండియా బీ-747 ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2 తేదీల్లో చైనా నుంచి భారతీయులను తీసుకొచ్చారు. ఇప్పటికే.. 510 మంది నమూనాలు పరిశీలంచగా.. నెగిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. ఫిబ్రవరి 6న ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్‌తో చైనాలో ప్రాణభయంతో గడిపిన భారతీయులు స్వదేశానికి చేరుకోగలిగారు కానీ.. ఇంటికి మాత్రం వెళ్లలేకపోయారు. అబ్జర్వేషన్ గదుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. కుటుంబసభ్యులకు దూరంగా ఉండటం బాధించింది. అయినా తప్పలేదు. రిపోర్టుల్లో రిజల్ట్ ఏమొస్తుందోనని అంతా కంగారుపడ్డారు. నెగిటివ్ రిజల్ట్ రావాలని దేవుడిని ప్రార్థించారు. తమ వారి యోగ క్షేమాల గురించి కుటుంబసభ్యులు కూడా వర్రీ అయ్యారు. చివరకు.. నెగిటివ్ అని తేలడంతో.. అంతా రిలాక్స్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లనున్నామనే వార్త అందరిలో ఆనందం నింపింది.