PC: Southern Railway
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా తమిళనాడులో పర్యటించి న్యూ పాంబన్ రైలు వంతెనను ప్రారంభించనున్నారు. అలాగే, రామేశ్వరం-తాంబరం రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ న్యూ పంబన్ బ్రిడ్జీ భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
PC: Southern Railway
మనదేశపు తొలి వర్టికల్ బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి మొదలుకుని బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానిస్తుంది. న్యూ పంబన్ వంతెనను రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవరత్న పీఎస్‌యూ రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) నిర్మించింది. 2020లో పనులు ప్రారంభించింది. ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
బ్రిడ్జి ప్రత్యేకతలు
ఈ బ్రిడ్జిపై 600 మీటర్ల పరిధిలో భారీ పరిమాణంలో వర్టికల్ లిఫ్ట్ ఉంది. దీని పనులు పూర్తికావడానికే దాదాపు 5 నెలలు పట్టింది. దాని బరువు 660 టన్నులు. పొడువు 72.5 మీటర్లు. ఈ పాంబన్ బ్రిడ్జి మొత్తం పొడవు 2.07 కిలోమీటర్లు. బ్రిడ్జి కింద నుంచి ఓడలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పోవచ్చు.
PC: Southern Railway
బ్రిడ్జికి ఇరు వైపులా ఉండే భారీ స్తంభాలకు 320 టన్నుల బరువు ఉన్న దూలాలు (బరువు 625 టన్నులు) వేలాడుతూ ఉంటాయి. న్యూ పంబన్ వంతెన ద్వారా ఈ ప్రాంతపు సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను కాపాడుకోవడమేగాక, ఇక్కడ డిజైన్, కనెక్టివిటీ, ప్రాంతీయ అభివృద్ధిలో సాధించిన అభివృద్ధిని సూచిస్తోంది.
సుమారు 104 సంవత్సరాల కిందట నిర్మించిన పాత పాంబన్ బ్రిడ్జి ఇనుముకు తుప్పు పట్టింది. న్యూ బ్రిడ్జికి తుప్పు పట్టకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్ పెయింట్ వేసినట్లు అధికారులు తెలిపారు. మరో 58 ఏళ్ల వరకు తుప్పు పట్టదు. అలాగే, రిపైర్లు చేయిస్తే దాదాపు వందేళ్ల వరకు తుప్పు సమస్య ఉండదు.
PC: Southern Railway
కెరటాలు బ్రిడ్జిపైకి వస్తుంటాయి. ఈ కారణంగానే పాత వంతెన ఇనుముకి తుప్పుపట్టింది. వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జికి బోల్టులు వాడలేదు. మొత్తం వెల్డింగ్‌తోనే తయారుచేశారు. ఈ న్యూబ్రిడ్జికి 2019, మార్చి 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
మరిన్ని ప్రత్యేకలు