Gujarat Ministers Resign: గుజరాత్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి తప్ప మంత్రులు అంతా రాజీనామా చేసేశారు. శుక్రవారం జరగనున్న ప్రధాన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులందరూ రిజైన్ చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో పదవిలో కొనసాగుతున్న ఏకైక సభ్యుడు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాత్రమే.
ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నాయకత్వం సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. సమావేశం తర్వాత 16 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆయన ఈ రాత్రికి గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు వాటిని అందజేస్తారు.
శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది.
రాష్ట్ర మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్ నిర్మించడానికి వీలుగా మంత్రులను రాజీనామా చేయాలని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ ఆదేశించారని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. భవిష్యత్ ఎన్నికలకు ముందు బీజేపీ విస్తృత సంస్థాగత వ్యూహంలో భాగంగా ఈ చర్యను భావిస్తున్నారు.
Also Read: పీకే సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం..