All Party
all-party meeting in delhi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించి 11గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. ఇక సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌లీడర్ల సమావేశం కూడా మధ్యాహ్నం 3గంటలకు జరగనున్నట్టు సమాచారం. ఈ సమావేశాలకు కూడా మోదీ హాజరు కానున్నారు.
రేపటి నుంచి డిసెంబర్ 23 వరకు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. కొవిడ్ ప్రభావంతో గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలనూ కుదించారు. ఈ దఫా పార్లమెంటు ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశం కానున్నాయి. మొత్తం 26 బిల్లులను ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు.
Father Beat Son : అల్లరి చేస్తున్నాడని కొడుకును చితకబాదిన తండ్రి..పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
ఇందులో మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఉంది. దీనితో పాటు క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్, డిజిటల్ కరెన్సీ బిల్లు, మత్తుపదార్థాల వినియోగానికి సంబంధించిన బిల్లు, ప్రభుత్వ రంగ బ్యాకుంలో మెజారిటీ వాటను తగ్గించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బ్యాకుల్లో ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న 51 శాతం వాటను 26 శాతానికి తగ్గించాలనే ఆలోచనలో కేంద్రం ఉంది.