Kerala Govt : కేరళ రాష్ట్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం .. తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్‌ ఏర్పాటు

Kerala Govt :  కేరళ పినరాయి విజయన్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేరళ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కేరళ శాసనసభకు తొలిసారిగా మహిళా స్పీకర్ ప్యానెల్ ఏర్పాటు చేసింది. అధికార వామపక్షాలు ఇద్దరి పేర్లను, ప్రతిపక్ష యూడీఎఫ్ ఒకరి పేర్లను సూచించడంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తరపున సిపిఐ(ఎం) శాసనసభ్యులు యు ప్రతిభ, సీకే ఆషా.. ప్రతిపక్షాల తరపున (యుడిఎఫ్ మిత్రపక్షమైన రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన) ఎమ్మెల్యే కేకే రెమ ప్రాతినిధ్యం ఈ ప్యానెల్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ సభలో ఉన్నప్పటికీ రెమా పేరును యూడీఎఫ్ సూచించింది.

మహిళా అభ్యర్థుల పేర్లను ప్యానెల్‌కు పరిశీలించాలని కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎంఎన్ శ్యాంసీర్ సిఫార్సు చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ సమావేశాల సమయంలో లేనప్పుడు స్పీకర్ ప్యానెల్‌లోని ఎవరైనా అసెంబ్లీ కార్యకలాపాలను నియంత్రించాల్సి ఉంటుంది. కాగా..కేరళలో ప్రస్తుత శాసనసభ ఏడో సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం నాల్గవ సెషన్ డిసెంబర్ 5 నుండి 15 వరకు షెడ్యూల్ చేయబడింది. దీనికి స్పీకర్ షంసీర్ అధ్యక్షత వహిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు