Gyanvapi Masjid Dispute : జ్ఞాన్ వాపి మసీదు వివాదం.. అంజుమన్ మసీదు కమిటీ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఆర్డర్ 7 సీపీసీపై అంజుమన్ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పైనే కోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు సుప్రీంకోర్టునూ ఆశ్రయిస్తామని తెలిపారు.

Allahabad High Court : జ్ఞాన్ వాపి మసీదు వివాదం విషయంలో అంజుమన్ మసీదు కమిటీ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జ్ఞాన్ వాపి మసీదులో పూజలు చేసే హక్కును కోరుతూ వారణాసి కోర్టులో ఐదుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ కొనసాగింపును సవాల్ చేస్తూ అంజుమన్ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.

కోర్టు తీర్పు అనంతరం న్యాయవాది సుభాష్ నందన్ చతుర్వేది మాట్లాడుతూ ఇది హిందువుల విజయమని తెలిపారు. అంజుమన్ ఇంటజమియ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.

Land Rates Hike : పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. ఆఫీసులకు జనాల పరుగులు

ఇది చారిత్రక తీర్పు అని, అంజుమన్ మసీదు కమిటీ పిటిషన్ కు విచారణ అర్హత లేదని కోర్టు స్పష్టంగా చెబుతూ పిటిషన్ ను కొట్టివేసిందని తీర్పు అనంతరం కేసులో హిందువుల పక్షాన నిలిచిన విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు. మసీదు కమిటీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మహమద్ తహీద్ ఖాన్ కోర్టు తీర్పు హిందువుల పక్షానికి ఏమంత విజయం కాదని వ్యాఖ్యానించారు.

ఆర్డర్ 7 సీపీసీపై అంజుమన్ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పైనే కోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు సుప్రీంకోర్టునూ ఆశ్రయిస్తామని తెలిపారు.
కోర్టు తీర్పును అధ్యయనం చేసిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Maharashtra Children Trafficking : రైలులో 59మంది పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది  

జ్ఞాన్ వాపి వివాదానికి సంబంధించి మొత్తం ఏడు కేసులను కోర్టు బుధవారం విచారించింది.
జ్ఞాన్ వాపి మసీదు స్థలంలో ఆలయ పునరుద్ధరణను కోరుతూ దాఖలైన పిటిషన్ ను 2021, ఏప్రిల్ 8న విచారిస్తూ మసీదు కాంప్లెక్స్ లో సమగ్ర సర్వే నిర్వహించాలని ఏఎస్ఐని వారణాసి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు