Land Rates Hike : పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. ఆఫీసులకు జనాల పరుగులు
Land Rates Hike : గత రెండు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి జనాలు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో..

Land Rates Hike
Land Rates – Registration Charges : ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. రేపటి (జూన్ 1) నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయని.. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్లకు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లోనే భూముల ధరలు పెరగనున్నాయని సమాచారం. కాగా, ఎక్కడెక్కడ ల్యాండ్ రేట్లు మార్చాలన్న అంశంపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందాయి. 29 నుంచి 31శాతం మేర భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. భూముల ధరల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయనుంది.
భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగనున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం జనాలు క్యూ కట్టారు. గత రెండు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి జనాలు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కట్టారు.