Mahima Datla : ఆస్తి రూ.8700 కోట్లు..! ఏపీ, తెలంగాణలో అత్యధిక ధనిక మహిళ.. ఎవరీ మహిమా దాట్ల..?

భారతీయ మహిళలు వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. తమ సొంత నిర్ణయాలతో వినూత్న రీతిలో ఆలోచిస్తు గెలుపు సంతకాలు చేసే మహిళల్లో హైదరాబాదుకు చెందిన మహిమ దాట్ల పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఎవరీ మహిళా దాట్ల..? 45 ఏళ్లకే 8700కోట్లకు అధిపతి అయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ధనిక మహిళగా పేరొందిన ఈమె సక్సెస్ మంత్రం ఏమిటి..?

Mahima Datla : ఆస్తి రూ.8700 కోట్లు..! ఏపీ, తెలంగాణలో అత్యధిక ధనిక మహిళ.. ఎవరీ మహిమా దాట్ల..?

Mahima Datla

Mahima Datla : స్టార్టప్ లతో ప్రారంభించి వ్యాపారంలో దూసుకుపోతున్న మహిళా మణులు తనమదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. భారతీయ మహిళలు వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. తమ సొంత నిర్ణయాలతో వినూత్న రీతిలో ఆలోచిస్తు గెలుపు సంతకాలు చేసే మహిళల్లో హైదరాబాదుకు చెందిన మహిమ దాట్ల పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఎవరీ మహిళా దాట్ల..? 45 ఏళ్లకే 8700కోట్లకు అధిపతి అయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ధనిక మహిళగా పేరొందిన ఈమె సక్సెస్ మంత్రం ఏమిటి..? యువ వ్యాపారవేత్తగా రాణిస్తు మహిమా దాట్ల స్ఫూర్తిదాయక మహిళగా ఎలా ఎదిగారో తెలుసుకుందాం..

హైదరాబాదుకు చెందిన మహిమ దాట్ల వయసు 45సంవత్సరాలు. 75 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్ కు ప్రమోటర్ మరియు మనేజింగ్ డైరెక్టర్. 1953 సంవత్సరంలో ఫార్మా మార్గదర్మకులలో ఒకరైన దాట్ల వెంకట క్రిష్ణంరాజు దాట్ల బయోలాజికల్ E(Biological E) అనే ఫార్మా సంస్థను స్థాపించారు. రక్తం గడ్డకుండా నిరోధించే హెపారిన్(heparin) అనే మెడిసిన్ కనుగొనడంతో ఈ ఫార్మా ప్రస్థానం మొదలైంది. అప్పటినుంచి ఎన్నో విజయాలను అందుకుంది.

‘Audi Chaiwala’ : ఆడి కారులో వచ్చి వేడి వేడి టీ, కాఫీలు అమ్ముతున్న కుర్రాళ్లు

ఈ ఫార్మా సంస్థ వెంకట క్రిష్ణంరాజు తరువాత ఆయ కుమారుడు విజయ్ కుమార్ దాట్ల ఆధ్వర్యంలోకి వచ్చింది. ఆ విజయ్ కుమార్ గారి కూతురే మహిమ దాట్ల. లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసారు. 2013లోతండ్రి విజయ్ కుమార్ మరణించడంతో బయోలాజికల్ ఇ పగ్గాలు మహిమ దాట్ల చేతుల్లోకి వచ్చాయి. అప్పటి నుండి సంస్థ సిఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా సంస్థ ఉన్నతి కోసం కృషి చేస్తున్నారు. మహిళా దాట్ల ఆధ్వర్యంలో ఈ సంస్థ 100కంటే ఎక్కువ దేశాలకు వ్యాక్సిన్ లను సరఫరా చేస్తోంది.

 

గత పదేళ్లలో 200కోట్లకు పైగా డోసుల్ని అందించిన ఘనత చేసిన ఘనత బయోలాజికల్ E కు దక్కింది. ఈ వ్యాక్సిన్ లలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధులకోసం తయారుచేసిన వ్యాక్సన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ ను తయారుచేస్తున్నఅతి పెద్ద సంస్థ బయోలాజికల్ ఇ నే కావటం గమనించాల్సిన విషయం.

 

2022లో 7,700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ 2023 నాటికి రూ.1000కోట్లుకు పెరిగి రూ. 8,700కోట్లకు చేరుకుంది. 2022లో Corbevax పేరుతో కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేయటంతో గరిష్ట టర్నోవర్ సాధించిందీ సంస్థ. ఆమె ఆస్తుల విలువ రూ.8,700 కోట్లకు పెరగటంతో ఆమె ఆంధ్రా, తెలంగాణలలో ఉన్న అత్యంత సంపన్న మహిళగా ఘతన సాధించారు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ధనికులలో 10వ స్థానంలో ఉన్నారు మహిళా దాట్ల.

Kerala : ఒకప్పుడు కేటరింగ్ బాయ్.. ఇప్పుడు రెస్టారెంట్ల ఓనర్.. చెఫ్ పిళ్లై లైఫ్ స్టోరి

హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్‌ సంస్థకు మూడో తరం నాయకురాలిగా తండ్రి మరణంతో సంస్థ బాధ్యతల్ని చేపట్టాక ఆమె సంస్థ ఉన్నతి కోసం కృషి చేశారు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనిక మహిళగాను..ఏపీ, తెలంగాణలోని ధనికల్లో 10 స్థానంలోను ఉన్నారు.