Amaravati MP: పార్లమెంట్‌లోనే బెదిరించారు.. యాసిడ్ దాడి చేస్తామంటున్నారు

అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ, టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ పార్లమెంట్ లోనే బెదిరించారని.. యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కు వ్యతిరేకంగా హౌజ్ లో మాట్లాడితే జైలులో..

Amaravati MP: పార్లమెంట్‌లోనే బెదిరించారు.. యాసిడ్ దాడి చేస్తామంటున్నారు

Mp Navneet Shivasena

Updated On : March 23, 2021 / 1:42 PM IST

Amaravati MP: అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ, టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ పార్లమెంట్ లోనే బెదిరించారని.. యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కు వ్యతిరేకంగా హౌజ్ లో మాట్లాడితే జైలులో వేస్తామని బెదిరించారని ఆమె అంటున్నారు. యాసిడ్ దాడి చేస్తామని ఫోన్ కాల్స్ లో బెదిరింపులు, శివసేన లెటర్ హెడ్స్ మీద వార్నింగులు విషయాన్ని స్పీకర్ ఓం బిర్లాకు కూడా వివరించినట్లు ఆమె అన్నారు.

మార్చి 22న ‘ఈ రోజు పార్లమెంట్ సభ్యుడు అరవింద్ శావంత్ నన్ను బెదిరించాడు. నా ఒక్కదానికే కాదు. దేశంలోని మహిళలందర్నీ. అందుకే అతనిపై పోలీస్ యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నా. అని నవనీత్ చెప్పుకొచ్చారు.

మహారాష్ట్రలో జరుగుతున్న వ్యవహారశైలిపై మాట్లాడుతుంటే ఆమెపై శావంత్ ఆగ్రహానికి గురయ్యారట. మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా. జైలులో పడేలా చేస్తా. అని బెదిరించారట.

ఆ సమయంలో నాకేం చేయాలో తెలియలేదు. వెంటనే వెనక్కు తిరిగి నా వెనుక కూర్చొన్న వ్యక్తిని అడిగా అతనేం అన్నాడో మీరు విన్నారా అని. వాళ్లు కూడా అవుననే చెప్పారు. అని లోక్ సభలో జరిగిన ఘటనను మీడియాకు వివరించారు.

నేను ఇంతకు ముందే కంప్లైంట్ చేశా. పోలీసులకు, ఓం బిర్లాకు కూడా గుర్తు తెలియని లెటర్లు శివసేన పేరుతో వస్తున్నాయని అన్నారు. నువ్వు అందంగా ఉందని ఫీల్ అవుతున్న నీ ముఖంపై యాసిడ్ తో దాడి చేస్తామని, అప్పుడు ఎక్కడికి వెళ్లలేవని బెదిరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

దానిపై స్పందించిన శావంత్… శివసేనకు చెందిన ఓ వ్యక్తి నవనీత్ క్యాస్ట్ సర్టిఫికేట్ పై కంప్లైంట్ చేశాడు. అందుకే ఆమె పార్టీపై కోపంగా ఉంది. యాసిడ్ దాడులు చేసే వారిని నేను అడ్డుకుంటా. ఒకవేళ చేయడానికి ప్రయత్నిస్తే నేను నవనీత్ తో పాటు నిల్చొంటా అని వివరణ ఇచ్చుకున్నారు.