×
Ad

Punjab: కొత్త పార్టీ పెడుతున్నాను.. పేరు పెట్టలేదు.. బీజేపీతో పొత్తుకు రెడీ -మాజీ సీఎం

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లుగా ప్రకటించారు అయితే పార్టీ పేరు ఇంకా నిర్ణయించలేదని అన్నారు.

  • Published On : October 27, 2021 / 11:54 AM IST

Humiliated Amarinder Singh Resigns as CM

Punjab: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లుగా ప్రకటించారు అయితే పార్టీ పేరు ఇంకా నిర్ణయించలేదని అన్నారు. కత్త పార్టీ, గుర్తు, ఆమోదం తదితర విషయంలో మా లాయర్లు ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తున్నారని పంజాబ్ మాజీ సీఎం చెప్పారు.

పేరు నిర్ణయించిన వెంటనే మీడియా సమావేశం పెట్టి తెలియజేస్తామని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మ్యానిఫెస్టోలో పెట్టి అన్నీ హామీలను నెరవేర్చానని అన్నారు అమరీందర్. పంజాబ్ సెక్యురిటీ విషయంలో రాజీపడకుండా పనిచేశానని అన్నారు. నేను సైనికుడిలా పనిచేశాను. ఎప్పుడూ యోధుడిలా పోరాడాను.

పంజాబ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసినట్లు చెప్పిన అమరీందర్.. పంజాబ్ భద్రత నాకు చాలా ముఖ్యమని, ఆ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదన్నారు. రాబోయే పార్టీతో కూడా అధికారంలోకి వచ్చి పంజాబ్ ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. త్వరలో ఆ పార్టీ పేరు, గుర్తు, జెండా, ఎజెండాలను వివరిస్తానని అన్నారు.

తాను పెట్టబోయే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని, సీట్లు రెండు పార్టీలు షేర్ చేసుకుంటాయని అన్నారు అమరీందర్ సింగ్. అయితే, ఈ విషయంలో ఇంకా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.