Amazon.. ఇదో ఈస్ట్ ఇండియా కంపెనీ.. ఏకిపారేసిన ఆర్ఎస్ఎస్ ‘పాంచ‌జ‌న్య‌’ మ్యాగజైన్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోలుస్తూ సంచలన కథనాన్ని ప్రచురించింది RSS అనుబంధ మ్యాగజైన్ పాంచజన్య.

Amazon – East India Company 2.0 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోలుస్తూ సంచలన కథనాన్ని ప్రచురించింది రాష్ట్రీయ స్వయం సేవక్​​ సంఘ్​ (RSS) అనుబంధ మ్యాగజైన్ పాంచజన్య. ఇటీవలే టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పాంచజన్య.. ఇప్పుడు అమెజాన్ ను కూడా ఏకిపారేసింది. అమెజాన్ అంటే.. ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0 అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ త‌మ‌కు అనుకూలంగా ఉండేందుకు భార‌త అధికారుల‌కు కోట్లల్లో లంచాలు ఇచ్చింద‌ంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అక్టోబ‌ర్ 3న రిలీజ్ కాబోయే లేటెస్ట్ ఎడిష‌న్ క‌వ‌ర్ స్టోరీలో అమెజాన్ ల‌క్ష్యంగా పాంచజన్య తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది.
Amazon-Flipkart పోటాపోటీ : ఆఫర్లే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు!

భారతదేశంపై గుత్తాధిపత్యం కోసం 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ ఎలాంటి చర్యలకు పాల్పడిందో.. ఇప్పుడు అమెజాన్‌ కూడా అదే తరహాలో చేస్తోందంటూ విమర్శించింది. భారత మార్కెటుపై ఏకఛత్రాధిపత్యం కోసం ప్రయత్నాల్లో భాగంగా అమెజాన్ మన పౌరుల వ్యక్తిగత, అర్థిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. పాంచజన్య ఎడిటర్ హితేశ్ శంకర్ సోమవారం అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఫొటోకు #Amazon: East India Company 2.0″ అనే హెడ్ లైన్‌తో క్యాప్షన్ తో ట్వీట్ చేశారు.

ఇటీవలే కొత్త జీఎస్టీ పోర్టల్​ రూపొందించే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్​కు అప్పగించింది. అయితే ఈ పోర్టల్​ డిజైన్​లో లోపాలపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఇన్ఫోసిస్​పై కేంద్రంతో పాటు పన్ను చెల్లింపుదారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ పాంచజన్య కూడా ఇదే నెలలో ఇన్ఫోసిస్​పై విరుచుకుపడింది.

గ‌త మూడేళ్ల‌లో అమెజాన్ రూ.8500 కోట్ల మేర లీగ‌ల్ ఖ‌ర్చులు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. త‌మ‌కు అనుకూల‌మైన విధానాల కోసం అమెజాన్ ప్ర‌భుత్వ అధికారుల‌కు కోట్ల‌లో లంచాలు చెల్లించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఇప్పటికే అమెరికా హెడ్ క్వార్టర్ కంపెనీ అమెజాన్ అంత‌ర్గ‌తంగా విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విషయంలో అమెజాన్ ప్రమేయంపై ప్రత్యేకించి పూర్తిస్థాయిలో విచారణ జరుగనున్నట్టు కేంద్రం గతవారమే పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీ సీనియర్ కార్పొరేట్ కౌన్సిల్ ను సెలవుపై పంపినట్టు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఈ వ్యవహారం వెలుగుచూసింది అనేది స్పష్టత లేదు. అమెజాన్‌ ప్రైమ్ వీడియో కూడా భార‌త సంస్కృతికి విరుద్ధ‌మైన సినిమాలు, వెబ్‌సిరీస్ రిలీజ్ చేస్తోంద‌ని ఆరోపణలు ఉన్నాయి.
Reserve Bank : ఏటీఎం వద్ద ఓ మనిషి ఎంతసేపు ఓపికగా ఉండగలడు ?..సంచలన విషయాలు

మరోవైపు.. ఆర్ఎస్ఎస్ పాంచజన్య కథనాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌పై విమర్శల దాడి చేసినందుకు ‘జాతీయ వ్యతిరేక’ పత్రిక అంటూ విమర్శించారు. ఈ-కామర్స్ ప్రతిపాదిత విధాన మార్పులపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ 106 బిలియన్ డాలర్ల టాటా గ్రూపు అభ్యంతరాలను స్వీకరించిన నెల తర్వాత ఇన్ఫోసిస్‌పై పాంచజన్య కథనం బయటకు వచ్చింది.

Amazon – East India Company 2.0: Magazine’s Latest After Infosys Attack

ట్రెండింగ్ వార్తలు