Amazon food delivery: భారత్‌లో ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేయనున్న అమెజాన్.. ఎందుకంటే?

దేశంలోని హైస్కూల్ విద్యార్థులకోసం ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 29నుంచి దేశంలో తన ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుంది.

Amazon food delivery: దేశంలోని హైస్కూల్ విద్యార్థులకోసం ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 29నుంచి దేశంలో తన ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని దాని రెస్టారెంట్ భాగస్వాములకు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థల్లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ప్రారంభించినట్లు ఇప్పటికే అమెజాన్ తెలిపింది.

Amazon Web Services: హైదరాబాద్‌లో ప్రారంభమైన అమెజాన్ అనుబంధ సంస్థ… సంవత్సరానికి 48 వేల ఉద్యోగాలు

భారతదేశంలో 2020 మే నెలలో అమెజాన్ తన ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించి, ఆ తరువాత నగరం మొత్తం దీని సేవలను విస్తరించింది. కానీ, అమెజాన్ దీనికి ఎక్కువగా ప్రచారం చేయలేదు. తమ సేవలను నిలిపివేస్తున్న తన రెస్టారెంట్ భాగస్వాములకు అమెజాన్ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఇదిలాఉంటే భారతదేశ మార్కెట్‌కు అందుబాటులో ఉంటామని అమెజాన్ తెలిపింది. కిరాణా, స్మార్ట్‌ఫోన్‌లు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, అలాగే అమెజాన్ బిజినెస్ వంటి B2B ఆఫర్‌లలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది.

Amazon founder Jeff Bezos : కార్లు,టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి..డబ్బులుంటే దాచుకోండి.. : జెఫ్ బెజోస్ సూచనల వెనుక పొంచి ఉన్న ఉపద్రవం

అమెజాన్‌కు భారతదేశం కీలకమైన విదేశీ మార్కెట్. శాన్‌ఫోర్డ్ సి.బెర్న్‌స్టెయిన్ ఇటీవల నివేదిక ప్రకారం.. కంపెనీ వాల్ మార్ట్ యొక్క ఫ్లిప్‌కార్డ్ కంటే వెనుకబడి ఉంది. దేశంలోని చిన్న నగరాలు, పట్టణాలలో ఆశించిన స్థాయిలో తమ సేవలను అందుబాటులోకి తేలేకపోయింది. దీంతో దేశంలో అమెజాన్ యొక్క 2021 స్థూల సరుకుల విలువ 18బిలియన్ డాలర్లు నుండి 20 బిలియన్ డాలర్లు మధ్య ఉంది. ఫ్లిప్‌కార్డ్ 23బిలియన్ డాలర్ల కంటే వెనుకబడి ఉందని నివేదిక ద్వారా తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు