అనంత్ అంబానీ పెళ్లి వేళ.. రిలయన్స్ ఉద్యోగులకు ఏం పంపుతున్నారో చూడండి
రిలయన్స్ ఉద్యోగులు తమకు అందిన గిఫ్ట్ బాక్సుల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Anant Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీతో పారిశ్రామికవేత్త వైరన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఉద్యోగులకు గిఫ్టు బాక్సులు పంపారు.
చాలా మంది రిలయన్స్ ఉద్యోగులు తమకు అందిన గిఫ్ట్ బాక్సుల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రెడ్ కలర్ లో ఉన్న ఈ గిఫ్ట్ బాక్సులో గోల్డ్ కలర్ అక్షరాలతో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి గురించి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ రాసినట్లు ఉంది. మన దేవుళ్లు, దేవతల ఆశీర్వాదంతో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకను జరుపుకుంటున్నామని అందులో పేర్కొన్నారు.
ఆ బాక్సులో స్వీట్లు, సిల్వర్ కాయిన్‌తో పాటు మిక్చర్ ప్యాకెట్ కూడా ఉంది. రిలయన్స్‌లో పనిచేస్తున్నందుకు ప్రోత్సాహకాలని ఉద్యోగిని తన్యా రాజ్ ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా కొన్ని నెలలుగా నిర్వహించారు. ప్రస్తుతం మూడు రోజుల పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
Thankyou @reliancejio for the sweets
We wish best for the Anant Ambani’s wedding. pic.twitter.com/GYdk7BiJQN— The codewali (@the_codewala) July 10, 2024
View this post on Instagram
Also Read: అనంత్ అంబానీ పెళ్లి ఎఫెక్ట్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చిన పలు కంపెనీలు.. ఎందుకంటే?