Indian Deportees : ధర్డ్ బ్యాచ్.. 112 మంది భారతీయులను వెనక్కి పంపేసిన అమెరికా.. ఎక్కడ దింపేశారంటే..

7 US వైమానిక దళానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ విమానం రాత్రి 10 గంటల సమయంలో విమానాశ్రయంలో ల్యాండైంది.

Indian Deportees : తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపే ప్రక్రియ కొనుసాగుతోంది. ఇప్పటికే రెండు బ్యాచ్ లలో భారతీయులను వెనక్కి పంపేసింది. తాజాగా మూడో బ్యాచ్ కూడా వచ్చేసింది.

అక్రమవలసదారులతో కూడిన అమెరికా విమానం అమృత్ సర్‌లో ల్యాండ్ అయయింది. శ్రీగురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి అమెరికా విమానం దిగింది. థర్డ్ బ్యాచ్ లో 112 ఇండియన్స్ ని అమెరికా పంపించింది. వీరిలో 44 మంది హర్యానాకు చెందిన వారు ఉన్నారు. గుజరాత్‌కు చెందిన వారు 33 మంది ఉన్నారు. పంజాబ్‌కు చెందిన వారు 31 మంది ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి చెరొకరు ఉన్నారు.

7 US వైమానిక దళానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ విమానం రాత్రి 10 గంటల సమయంలో అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైంది. అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అణిచివేత చర్యల్లో భాగంగా గత 10 రోజుల్లో ఇలా రావడం ఇది మూడోసారి. తమ వారిని రిసీర్ చేసుకునేందుకు పలు కుటుంబాలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి.

Also Read : పెళ్లిలో తీవ్ర విషాదం.. గుర్రం ఎక్కిన కాసేపటికే పెళ్లి కొడుకు మృతి.. షాక్ లో బంధుమిత్రులు, గెస్టులు..

ఫార్మాలటీస్ పూర్తయ్యాక అంటే.. ఇమిగ్రేషన్, బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ తర్వాత వలసదారులు తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. వారిని వారి ఇళ్లకు చేరేందుకు అధికారులు వాహనాలు కూడా ఏర్పాటు చేశారు.

శనివారం (15వ తేదీ) రోజున కూడా ఓ అమెరికా విమానం భారత్ కు వచ్చింది. ఆ విమానంలో 116 మంది భారతీయ అక్రమవలసదారులు ఉన్నారు. వీరిలో 65 మంది పంజాబ్‌కు చెందిన వారు. 33 మంది హర్యానా వాసులు. కాగా, తమ చేతులకు బేడీలు వేసి భారత్‌కు పంపించారని కొందరు వాపోయారు.

భారతీయ అక్రమ వలసదారులతో తొలి అమెరికా విమానం ఫిబ్రవరి 5న ఇండియాకు వచ్చింది. తొలి దశలో 104 మంది ఇండియా చేరుకున్నారు. ఆ సమయంలో చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి వారిని తరలించడం దుమారం రేపింది.