Groom Collapses : పెళ్లిలో తీవ్ర విషాదం.. గుర్రం ఎక్కిన కాసేపటికే పెళ్లి కొడుకు మృతి.. షాక్ లో బంధుమిత్రులు, గెస్టులు..
పెళ్లి వేడుకల్లో భాగంగా బారాత్ నిర్వహించారు. ఇందులో వరుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి కాసేపు డ్యాన్స్ చేశాడు.

Groom Collapses : మధ్యప్రదేశ్ రాష్ట్రం షియోపూర్ సిటీలో పెళ్లి వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి బయలుదేరిన పెళ్లి కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. మండపానికి బయలుదేరేందుకు గుర్రం ఎక్కిన వరుడు ఆ కాసేపటికే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.
వరుడి పేరు ప్రదీప్ జాట్. వయసు 25 ఏళ్లు. ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడిగా పని చేశాడు. ప్రదీప్ కు పెళ్లి ఫిక్స్ అయ్యింది. వివాహానికి అన్నీ సిద్ధం చేశారు. బంధుమిత్రులు తరలివచ్చారు. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు.
పెళ్లి వేడుకల్లో భాగంగా బారాత్ నిర్వహించారు. ఇందులో వరుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి కాసేపు డ్యాన్స్ చేశాడు. తర్వాత పెళ్లి మండపానికి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. అతడిని గుర్రంపై తీసుకెళ్లేందుకు గుర్రం తీసుకొచ్చారు. వరుడు ప్రదీప్ గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఆ కాసేపటికే ఘోరం జరిగిపోయింది. పెళ్లి కొడుకు ప్రదీప్ ఉన్నట్లుండి కుప్పకూలాడు. అలాగే చలనం లేకుండా ఉండిపోయాడు.
मध्यप्रदेश: श्योपुर जिले में एक हैरान कर देने वाली घटना सामने आई। शादी के दौरान घोड़ी पर सवार एक दूल्हे की मौत हो गई
मौत से पहले दूल्हे ने बरातियों के साथ जमकर डांस भी किया दुल्हन स्टेज पर दूल्हे का इंतजार करती रही लेकिन दूल्हे के आने से पहले उसकी मौत की खबर आ गई।#heartattack pic.twitter.com/SvIA4tq7Fd— Raajeev Chopra (@Raajeev_Chopra) February 15, 2025
ప్రదీన్ ను ఆ స్థితిలో చూసిన బంధువులు, మిత్రులు షాక్ కి గురయ్యారు. అతడిని లేపేందుకు చాలా ప్రయత్నం చేశారు. అయితే అతడిలో ఎలాంటి చలనం లేదు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
Also Read : అతి భారీ తిమింగలం నన్ను నోట్లో కరుచుకుని పట్టుకుంది.. ఆ సమయంలో నేను.. భయానక అనుభవాన్ని చెప్పిన యువకుడు
పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెను విషాదం అలుముకుంది. కాసేపట్లో వధువు మెడలో తాళ్లి కట్టాల్సిన పెళ్లి కొడుకు మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, వరుడు మృతికి హార్ట్ ఎటాక్ కారణం అని తెలుస్తోంది. సడెన్ గా గుండెపోటు రావడం వల్లే అతడు ప్రాణాలు వదిలేశాడని చెబుతున్నారు.