అతి భారీ తిమింగలం నన్ను నోట్లో కరుచుకుని పట్టుకుంది.. ఆ సమయంలో నేను.. భయానక అనుభవాన్ని చెప్పిన యువకుడు

తనకు ముదురు నీలం, తెలుపు రంగులు తప్ప ఇంకేమీ కనపడ లేదని అతడు అన్నాడు.

అతి భారీ తిమింగలం నన్ను నోట్లో కరుచుకుని పట్టుకుంది.. ఆ సమయంలో నేను.. భయానక అనుభవాన్ని చెప్పిన యువకుడు

Updated On : February 16, 2025 / 7:58 PM IST

 

సముద్రంలో బోటుపై షికారు చేద్దామని వెళ్లిన ఓ యువకుడిపై అతి భారీ తిమింగలం దాడి చేసి మింగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. చిలీలోని పటగోనియాలో ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల ఆడ్రియన్‌ తన తండ్రి డేల్‌తో కలిసి కయాక్‌లో విహరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచసుకుంది. చివరకు తిమింగలం ఉమ్మివేయడంతో మళ్లీ దాని నోటి నుంచి బయటకు వచ్చి ఆడ్రియన్‌ ప్రాణాలతో బయటపడ్డాడు.

దీనిపై ఆడ్రియన్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఎదురైన భయానక అనుభవం గురించి చెప్పాడు. తనను వెనుక నుంచి ఏదో గట్టిగా తాకినట్లు అనిపించిందని అడ్రియన్ అన్నాడు.

Also Read: ఈ సారి ఎండలు ఎలా ఉండనున్నాయో తెలుసా? అప్పట్లో ఎండలు మండిపోయినదానికంటే దారుణం

తాను కళ్లు మూసుకున్నానని, మళ్లీ కళ్లను తెరిచినప్పుడు తాను తిమింగలం నోటి లోపల ఉన్నానని గ్రహించానని తెలిపాడు. రెండు భారీ బ్రష్‌ల మధ్య ముఖం ఉంటే ఎలా ఉంటుందో అలాంటి అనుభవాన్ని అనుభవించానని చెప్పాడు.

తనకు ముదురు నీలం, తెలుపు రంగులు తప్ప ఇంకేమీ కనపడ లేదని అన్నాడు. ఒకవేళ తనను తిమింగలం మింగితే ఏమి చేయగలను అని తాను విస్మయానికి గురయ్యానని చెప్పాడు. దానిపై పోరాడలేకపోయానని తెలిపాడు. తాను చనిపోయానని అనుకున్నానని, అది నన్ను తిన్నదని అనుకున్నానని తెలిపాడు. అది తనను మింగేసిందని చెప్పాడు.

కాగా, ఇటీవలే ఆడ్రియన్‌పై భారీ తిమింగలం దాడి చేసింది. తిమింగలం నోటిని తెరచి పడవతో సహా ఆడ్రియన్‌ను మింగింది. పడవతో పాటు ఆడ్రియన్‌ తిమింగళం నోటిలోకి వెళ్లిపోగా, కాసేపటికే తిమింగలం మళ్లీ ఉమ్మి వేసింది. అనంతరం తన తండ్రి సాయంతో ఆడ్రియన్‌ సముద్ర ఒడ్డుకు వచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Channel 4 News (@channel4news)