రాహుల్ నామినేషన్ చెల్లుతుంది…అమేథీ రిటర్నింగ్ అధికారి

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ పై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ ఆయన నామినేషన్ చెల్లతుందని సోమవారం(ఏప్రిల్-22,2019)అమేథీ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.రాహుల్ గాంధీ  విద్యార్హతలు,సిటిజన్ షిప్ పై పలువురు వ్యక్తం చేసిన సందేహాలపై ఈ సందర్భంగా  రాహుల్ తరపు న్యాయవాది కేసీ కౌషిక్ అమేధీలో మాట్లాడుతూ…రౌల్ విన్సీ ఎవరో,ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు.
Also Read : బరిలో షీలా దీక్షిత్ : ఢిల్లీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

రాహుల్ గాంధీ 1995లో కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి M.Phil పూర్తి చేశారు.ఆ సర్టిఫికెట్ కాపీని నేను అటాచ్ చేశాను. రాహుల్ గాంధీ భారత్ లో జన్మించారు.ఆయనకు భారతీయ పాస్ పోర్ట్ ఉంది.ఆయనకు వేరే ఏ దేశ పౌరసత్వం లేదు.ఆయన ఓటర్ ఐడీ,ఇన్ కమ్ ట్యాక్స్ ఇలా అన్నీ భారత్ లోనే ఉన్నాయని తెలిపారు.