త్వరలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై శుభవార్త వింటారని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. శనివారం గోరఖ్‌పూర్‌లో మురారి బాపు రామకథా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ…మనమంతా రాముని భక్తులం. మన భక్తిలో చాలా శక్తి ఉన్నది. త్వరలో మనందరికీ శుభవార్త అందుతుంది అని అన్నారు. రాముడ్ని ప్రేరణగా తీసుకుని జాతి నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.
అయోధ్యలోని వివాదస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థలానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న రోజువారీ విచారణ తుదిదశకు చేరుకుంటున్న సమయంలో సీఎం యోగి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.