Mamata Banerjee : త్రిపుర సీఎంకి అంత ధైర్యం లేదు..అభిషేక్ పై దాడి వెనుక అమిత్ షా హస్తం!

త్రిపురలో టీఎంసీని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో మమతాబెనర్జీ మేనల్లుడు,టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గతవారం త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.

Mamata Banerjee త్రిపురలో టీఎంసీని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో మమతాబెనర్జీ మేనల్లుడు,టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గతవారం త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు స్థానికులు.. కర్రలు, లాఠీలతో అభిషేక్ కారుపై దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురు టీఎంసీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. అయితే అభిషేక్,టీఎంసీ కార్యకర్తల పై దాడి వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

ఆదివారం కూడా  త్రిపురలో జరిగిన ఘర్షణలో గాయపడి కోల్​కతాలోని ఎస్ఎస్​కేఎం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న టీఎంసీ కార్యకర్తలను ఇవాళ మమత పరామర్శించారు. ఈసందర్భంగా మమత మాట్లాడుతూ..త్రిపుర, అసోం, యూపీ రాష్ట్రాల్లో భాజపా అరాచక పాలన నడుస్తోంది. కాషాయ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి చోట పరిస్థితి ఇలాగే ఉంది. అభిషేక్​తో పాటు పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు మమత తెలిపారు

కేంద్ర హోంమంత్రి మద్దతు లేకుండా ఇలాంటి దాడులు జరగవని మమత పేర్కొన్నారు. త్రిపుర పోలీసుల ఎదుటే ఈ దాడి జరిగిందని.. కానీ పోలీసులు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారన్నారు. ఇలాంటి దాడులు చేయాలని ఆదేశించే ధైర్యం త్రిపుర ముఖ్యమంత్రికి లేదని.. ఈ ఘటన వెనక ఉన్న హస్తం కేంద్ర హోంమంత్రిదేనని మమత ఆరోపించారు. ఇలాంటి చర్యలకు తలవంచబోమని దీదీ స్పష్టం చేశారు. త్రిపురలో రాబోయే ఎన్నికల్లో గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు

ట్రెండింగ్ వార్తలు