Amritpal Singh declared fugitive by punjab police
Amritpal Singh: వారిస్ పంజాబ్ దే చీఫ్, ఖలిస్తాన్ ఉద్యమకారుడు అమృత్‌పాల్ సింగ్‌ను ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా పంజాబ్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. అమృతపాల్‌ను పట్టుకునేందుకు శనివారం నుంచి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన పూర్వీకుల గ్రామం జల్లు ఖేదాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హింసాత్మక సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలను పొడిగించారు. పంజాబ్‌తోపాటు పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు.
TDP MLAs Suspend : ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఈ కేసులో దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించవచ్చునని, ఆయనపై జాతీయ భద్రత చట్టం ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమృత్‌పాల్ సహచరుల్లో నలుగురిని పంజాబ్ పోలీసులు అస్సాంలోని డిబ్రుగఢ్‌కు తీసుకెళ్లారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, ఇది పోలీసుల మధ్య సహకారమని వ్యాఖ్యానించారు.
Dhone Cell Phone Blast : బాబోయ్.. డోన్‌లో ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
గ్రామీణ అమృత్‌సర్ ఎస్ఎస్‌పీ సతీందర్ సింగ్ మాట్లాడుతూ, అజ్నాలా పోలీసు ఠాణాపై జరిగిన దాడి నేపథ్యంలో నమోదైన కేసులో అమృత్‌పాల్ సింగ్‌పై చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఆయన పరారయ్యారని, ఆయన సహచరుల్లో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 12-బోర్ వెపన్స్, కార్‌ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవన్నీ చట్టవ్యతిరేక ఆయుధాలని చెప్పారు. వీరిపై ఆయుధాల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అమృత్‌పాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.
Delhi: రాహుల్ గాంధీ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భారీ ఎత్తున నిరసన
ఇదిలా ఉంటే అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుగా పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. మొహాలి సరిహద్దులో శనివారం కువామి ఇన్సాఫ్ మోర్చా కార్యకర్తలు నిరసన చేశారు. బర్నాలా, ధనోలా, ఆనందపూర్ సాహిబ్ నంగార్, మన్సా వంటి ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఎస్ఎంఎస్ సర్వీలసులను కూడా అధికారులు నిలిపివేశారు. ఎవరి నుంచి ఎవరికి కమ్యూనికేషన్ లేకుండా చేశారు. అయినప్పటికీ అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేయనున్నారనే విషయం రాష్ట్రంలో విస్తృతంగా పాకి పోయింది.