TDP MLAs Suspend : ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు.

TDP MLAs Suspend : ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

TDP members

TDP MLAs Suspend : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీ విద్యుత్ మీటర్లపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్ పోడియనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంత చెప్పినా వినకుండా ఆందోళన కొనసాగించారు. సభలో గందగరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.

నిన్న (శనివారం) కూడా ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాస్తవాలు చెప్పాలంటూ సభలో ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియాన్ని సభ్యులు చుట్టుముట్టారు. సభకు ఆటంకం కలిగిస్తుండటంతో సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన కోరారు. ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంత చెప్పినా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా అలాగే ఆందోళన కొనసాగించారు.

CAG Report in AP Assembly : ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక .. కీలక అంశాల ప్రస్తావన

దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గద్దె రామ్మోహన్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ మంతెన, గొట్టిపాటి, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, బెందాలం అశోక్ లను స్పీకర్ సస్పెండ్ చేశారు.