Earthquake Rajasthan
Earthquake: దేశంలో మూడు చోట్ల భూకంపాలు సంభవించినట్లుగా జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం ప్రకటించింది. రాజస్థాన్, మేఘాలయ, లే-లడఖ్‌లలో బుధవారం ఉదయం భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వణుకు కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాజస్థాన్‌లోని బికానెర్‌లో భూకంపం తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది.
ఉదయం 5 గంటల 24 నిమిషాల సమయంలో బికనీర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. అదే సమయంలో, మేఘాలయ మరియు లేహ్-లడఖ్‌లో కూడా వరుసగా 4.1 మరియు 3.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.
ఈ మూడు ప్రాంతాలలో భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరిగినట్లు నివేదిక లేనప్పటికీ, భూమి వణుకుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మేఘాలయలోని వెస్టు ఘరోహిల్స్ ప్రాంతంలో ఉదయం 4.1 మేగ్నట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది.
An earthquake of magnitude 5.3 on the Richter scale hit Bikaner, Rajasthan at 5:24 am today: National Centre for Seismology
— ANI (@ANI) July 21, 2021