Elderly Couple Sells Poha : హ్యాట్సాఫ్.. 70ఏళ్ల వయసులోనూ ఎవరి మీద ఆధారపడకుండా పోహా అమ్మి జీవనం

ఏజ్.. జస్ట్ ఓ నెంబర్ మాత్రమే అని ఈ వృద్ధ జంట చాటి చెప్పింది. మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే.. బతుకు భారం కాదని ప్రూవ్ చేసింది. 70ఏళ్ల వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా..

Elderly Couple Sells Poha : కాళ్లు, చేతులు అన్నీ సక్రమంగా ఉన్నా.. పని చేయడానికి బద్దకించే వారున్న రోజులివి. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా తమకేదో అయిపోయినట్టు, ఇంకేమీ పని చేయలేము అని ఫీల్ అయ్యే జనాలున్న రోజులివి. ఇక 60ఏళ్లు వచ్చాయంటే రెస్ట్ తీసుకునే వయసు వచ్చేసిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. వయసు మీద పడింది.. ఇక ఏ పనీ చేయలేము, ఇంట్లో ఏదో ఓ మూల పడుంటే సరిపోతుందని అనుకుంటారు. కొందరు వృద్దాప్యాన్ని శాపంగా భావిస్తారు. ఇతరుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి రావడమే ఇందుకు కారణం.

అయితే, అందరూ ఒకేలా ఉండరని ఈ వృద్ధ జంట నిరూపించింది. 70ఏళ్ల వయసులోనూ ఎవరి మీదా ఆధారపడకుండా తమ కాళ్ల మీద తామే నిల్చున్నారు. ఏడు పదుల వయసులోనూ కష్టపడి పని చేసి డబ్బు సంపాదించి జీవనం సాగిస్తున్నారు. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Walking : ప్రతిరోజు వాకింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే బెటర్?

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన 70ఏళ్ల వృద్ధ జంట తమ కడుపు నింపుకునేందుకు పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు. రోడ్డు పక్కన స్పెషల్ నాస్తా ‘తర్రి పోహా’ను తయారు చేసి అమ్ముతూ.. ఎవరి ఆధారం లేకుండా తమ కాళ్లపై తాము బతుకుతున్నారు. రుచికరమైన పోహాను కేవలం రూ.10కే అమ్ముతున్నారు. ఓ నెటిజన్ వీళ్ల స్టోరీని ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో వీళ్ల కష్టం అందరికీ తెలిసింది.

కాగా, ఈ జంట ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఉంది. బతుకు భారంగా మారడంతో వారు పోహా అమ్మాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామునే లేస్తారు. ఇద్దరూ కలిసి పోహా తయారు చేస్తారు. ఆ తర్వాత ఉదయం 5 గంటలకే తండాపేట్ లోని పండిట్ నెహ్రూ కాన్వెంట్ దగ్గరికి చేరుకుంటారు. నాగ్ పూర్ స్టైల్ లో చేసిన రుచికరమైన పోహాను కేవలం రూ.10కే అమ్ముతున్నారు. గత నాలుగేళ్లుగా వారు ఇలానే చేస్తున్నారు. వయసు మీద పడినా వారు విశ్వాసం మాత్రం కోల్పోలేదు. కష్టపడి పని చేసుకుంటూ పోహా అమ్మి వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటున్నారు.

WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్

ఏడు పదుల వయసులోనూ కష్టపడి పని చేసి పోహా అమ్మి జీవనం సాగిస్తున్న వృద్ధ జంట.. నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. ఆ జంటకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వారి పట్ల గౌరవం చూపిస్తున్నారు. రియల్లీ.. మీరు చాలా గ్రేట్ అని కితాబిస్తున్నారు. ఇక జీవితం అయిపోయింది, ఏ పని చేయలేము అని చిన్న చిన్న సమస్యలకే నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయే నేటి జనరేషన్ కు ఈ వృద్ధ జంట ఆదర్శంగా నిలుస్తుంది. వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఆత్మ విశ్వాసం కోల్పోకూడదని చాటి చెప్పేందుకే ఈ అవ్వా తాతలే నిలువెత్తు నిదర్శనం.

ట్రెండింగ్ వార్తలు