Walking : ప్రతిరోజు వాకింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే బెటర్?

వేడి వాతావరణంలో కాటన్ దుస్తుల‌ను ధ‌రించి వాకింగ్ చేయాలి. అదే చలి వాతావరణంలో అయితే ఉన్ని దుస్తుల‌ను ధ‌రించి వాకింగ్ చేయాలి.

Walking : ప్రతిరోజు వాకింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే బెటర్?

Walking

Walking : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవటం ఎంతముఖ్యమో వ్యాయామం చేయటం కూడా అంతే ముఖ్యం. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది.  వ్యాయామాల విష‌యానికి వ‌స్తే అన్నింటిలోనూ చాలా తేలికైంది, ఖ‌ర్చు అవ‌స‌రం లేనిది.. వాకింగ్‌. రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాకింగ్‌ను కింద తెలిపిన విధంగా చేస్తే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

అయితే వాకింగ్ చేసే విషయంలో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఎప్పుడు నడవాలి.. ఎలా నడవాలి..ఏసమయంలో నడిస్తే మంచిది అని సందేహాలు కలిగి ఉంటారు. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిది. ఎందుకంటే.. ఉదయం కాలుష్యం తక్కువగా ఉంటుంది. చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుంది.

వాకింగ్ చేసే వారు రోజుకు క‌నీసం గంట అయినా వాకింగ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే గంట సేపు వాకింగ్ ఒకేసారి చేయ‌లేక‌పోతే ఉద‌యం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున చేయ‌వ‌చ్చు. ఇలా వాకింగ్‌ను సుల‌భంగా పూర్తి చేయ‌వ‌చ్చు. వాకింగ్‌ను ప్రారంభించేట‌ప్పుడు నెమ్మ‌దిగా న‌డ‌వాలి. క్ర‌మంగా వేగం పెంచాలి.

షుగర్ ఉంటే తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకే వాకింగ్ చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయనే ఆందోళన ఉండదు. మిగిలిన వారు మామూలుగా పరగడుపున కూడా నడవచ్చు. కడుపు నిండా తిని స్పీడుగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు.

వాకింగ్ కోసం సౌక‌ర్యవంతంగా ఉండే షూస్ ధ‌రించాలి. దీంతో ఎక్కువ సేపు వాకింగ్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. నడుస్తున్నప్పుడు చేతులను వదులుగా చేసి ముందుకు, వెనుకకు ఆడించాలి. దీంతో శ‌రీరం రిలాక్స్ అవుతుంది. ఎక్కువ వ్యాయామం జ‌రుగుతుంది. నడక ప్రారంభించడానికి ముందు నీరు తాగాలి. దీని వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎక్కువ సేపు ఆయాసం రాకుండా వాకింగ్ చేయ‌వ‌చ్చు.

రోజుకు 10 వేల అడుగులు నడవాలని కొందరు లక్ష్యంగా పెట్టుకుంటారు.. అయితే ఇది ఎక్కడ నడిచామన్నది ప్రధానం కాదు. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. డాబాపైనో.. సెల్లార్ లోనో.. ఎక్కడైనా సరే. సాయంత్రం పూట కూడా వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ చేస్తే గుండె కొట్టుకునే వేగం పెర‌గాలి. చెమ‌ట ప‌ట్టేలాగా చేయాలి. ఇలా వాకింగ్ చేస్తే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రాత్రి పూట నడక వృద్ధులకు అంత మంచిది కాదు. కంటి చూపు సరిగా లేకపోవటం వల్ల ప్రమాదాలకు గురికావచ్చు.

వేడి వాతావరణంలో కాటన్ దుస్తుల‌ను ధ‌రించి వాకింగ్ చేయాలి. అదే చలి వాతావరణంలో అయితే ఉన్ని దుస్తుల‌ను ధ‌రించి వాకింగ్ చేయాలి. ఇలా వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ‌స్త్రాల‌ను ధ‌రించి వాకింగ్ చేస్తే మంచిది. వాకింగ్ చేస్తున్న‌ప్పుడు ఆయాసం వ‌స్తే కొంత సేపు విశ్రాంతి తీసుకుని మ‌ళ్లీ వాకింగ్‌ను ప్రారంభించ‌వ‌చ్చు. అయితే గుండె జ‌బ్బులు ఉన్న‌వారు వాకింగ్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎమ‌ర్జెన్సీ ఫోన్ నంబ‌ర్ల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి.

ప్రతిరోజు 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడుస్తూ.. రోజుకు రెండు నుంచి నాలుగు మైళ్ల దూరం నడవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు.