Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. అనంత్ అంబానీ – రాధిక పెండ్లిలో సందడి చేసిన ‘హ్యాపీ’ మృతి

ముకేశ్ అంబానీ కుటుంబంలో పెంపుడు కుక్క ’హ్యాపీ’ బుధవారం కన్నుమూసింది.

Anant Ambani pet dog ‘Happy

Anant Ambani pet dog ‘Happy’ passed away: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆ కుటుంబానికి అత్యంత ప్రియమైన, కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించే పెంపుడు కుక్క ’హ్యాపీ’ బుధవారం కన్నుమూసింది. అనంత్ అంబానీకి ఈ పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. అనంత్ – రాధిక వివాహం సమయంలో ఈ పెంపుడు కుక్క ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. అంబానీ కుటుంబంలోని పెద్దవారితోపాటు పిల్లలతోనూ ఈ ‘హ్యాపీ’ సందడి చేస్తూ కనిపించింది.


‘హ్యాపీ’ మృతితో అంబానీ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. వైరల్ అవుతున్న భయానీ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లోని పోస్టు ప్రకారం.. ‘‘అనంత్ అంబానీ పెంపుడు కుక్క ‘హ్యాపీ’ బుధవారం కన్నుమూసింది. కుటుంబ సభ్యులు ‘హ్యాపీ’ మృతికి నివాళులర్పించారు. ఈ పెంపుడు కుక్క వారి కుటుంబంలో సభ్యుడిగా పెరిగింది.’’ అని పేర్కొన్నారు.

అంబానీ కుటుంబం ‘హ్యాపీ’ని గుర్తు చేసుకుంటూ ఒక భావోద్వేగంతో రాసిన పోస్టు వైరల్ అవుతుంది. ‘‘డియర్ హ్యాపీ. నువ్వు ఎప్పటికీ మాలో భాగమై ఉంటావు. మా హృదయాల్లో జీవిస్తావు’’ అని రాశారు. ఈ పోస్టులో ‘హ్యాపీ’ ఫొటో చుట్టూ పూలమాలలు వేసి ఉంది.


అనంత్ అంబానీకి ఇష్టమైన పెంపుడు జంతువులో ‘హ్యాపీ’ ఒకటి. అనంత్ ఎక్కడికెళ్లినా హ్యాపీ అతనితో ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తుంది. అంబానీ కుటుంబంలో ఈ పెంపుడు కుక్కను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు. మీడియా నివేదికల ప్రకారం.. అంబానీ కుటుంబం పెంపుడు కుక్క హ్యాపీ రూ. 4కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ జీ400డీ లో తిరుగుతుంది. అంబానీ కుటుంబ భద్రతలో జీ63 ఏఎంజీ వంటి అత్యాధునిక వాహనాలు ఉండగా, జీ400డీ పెంపుడు కుక్క హ్యాపీ కోసం కేటాయించారు. మెర్సిడెస్-బెంజ్ జీ400డీ కి ముందు, హ్యాపీ టయోటా ఫార్చ్యూనర్, టయోటా వెల్‌ఫైర్‌ కార్లలో తిరిగిందట.