పెళ్లికి హాజరైన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ .. వాటి ధర ఎంతంటే?

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబాని, ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మచ్చంట్ లకుమార్తె రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది.

Anant Ambani Radhika wedding

Anant Ambani Radhika Merchant Wedding : ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబాని, ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మచ్చంట్ లకుమార్తె రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం వారిద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలతో పాటు.. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో అతిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంత్ అంబానీ వివాహానికి అతని స్నేహితులు, ఆత్మీయులు కూడా హాజరయ్యారు. వారికి అనంత్ అంబానీ ఖరీదైన బహుమతులు అందజేశారు.

Also Read : Rajinikanth : అంబానీ పెళ్లిలో.. అమితాబ్‌ను చూడ‌గానే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఏం చేశాడంటే.. వీడియో..

ఆడెమర్స్ పిగెట్ వాచీలను అనంత్ అంబాని తన స్నేహితులు, ఆత్మీయులకు, పలువురు ప్రముఖులకు అందజేశారు. ఈ వాచీలను అంబానీ ఫ్యామిలీ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించినట్లు సమాచారం. మొత్తం 25 వాచీలను ఆర్డర్ ఇచ్చారట. ఒక్కో వాచ్ విలువ రూ. 1.5కోట్ల నుంచి రూ. 2కోట్లు ఉంటుందని సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ వాచీలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఆ పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంత్ అంబానీ ఇచ్చిన బహుమతులను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Also Read : Xiaomi SU7 Electric Car : షావోమీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో 800 కి.మీ దూసుకెళ్తుంది!