Petrol Rate : నేటి పెట్రోల్ ధర, ఏపీలో పెరిగిన ఇంధన ధరలు, తెలంగాణలో స్థిరం

తెలంగాణలో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇప్పటికే రూ.110 ఉన్న పెట్రోల్ ధర.. ఇంకా పెరుగుతుండటం పేదలపై భారం రెట్టింపు చేస్తుంది.

Petrol Rate :  గత నెల వరకు పెట్రోల్ రేట్లు క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠానికి చేరాయి. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడం.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో నాటి నుంచి పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.10 మేర ధరలు తగ్గాయి. నాటి నుంచి ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొన్ని పట్టణాల్లో మాత్రం ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

చదవండి : Petrol Price : ఇది శుభవార్తే.. 14 రోజులుగా ధరల్లో నో చేంజ్

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా ఉండగా. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. వరంగల్‌లో నాలుగు రోజులుగా స్థిరమైన ధరలే ఉంటున్నాయి. పెట్రోల్ ధర రూ.107.69 గానే ఉండగా. డీజిల్ ధర కూడా రూ.94.14గా నిలకడగానే ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

చదవండి : Petrol Diesel Price: ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..

విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరుకు రూ.0.57 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.36 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.51 పైసలు తగ్గి రూ.96.45గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ స్వల్పంగా ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.111.31 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.0.34 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర రూ.0.35 పైసలు పెరిగి రూ.97.27గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.49గా ఉంది. పాత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.19 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.95.59గా ఉంది. ఇది లీటరుకు రూ.0.18 పైసలు పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు