Poisoned 20 Dogs: అరిచి విసిగిస్తున్నాయని 20కుక్కలకు విషం పెట్టి..

వీధి కుక్కలు విసిగిస్తున్నాయని 20కుక్కలకు విషమిచ్చి చంపేశాడో వ్యక్తి. ఒడిశాలోని కటక్ జిల్లాలో 24ఏళ్ల వ్యక్తి ఈ క్రూరత్వానికి ఒడిగట్టాడు. అతని మాంసం దుకాణం వద్ద రాత్రి సమయాల్లో..

Poisoned 20 Dogs: అరిచి విసిగిస్తున్నాయని 20కుక్కలకు విషం పెట్టి..

Straydogs

Updated On : September 23, 2021 / 7:10 AM IST

Poisoned 20 Dogs: వీధి కుక్కలు విసిగిస్తున్నాయని 20కుక్కలకు విషమిచ్చి చంపేశాడో వ్యక్తి. ఒడిశాలోని కటక్ జిల్లాలో 24ఏళ్ల వ్యక్తి ఈ క్రూరత్వానికి ఒడిగట్టాడు. అతని మాంసం దుకాణం వద్ద రాత్రి సమయాల్లో 20 వీధి కుక్కలు గుమిగూడి గోల పెట్టి విసిగిస్తుండేవట. అలా మృతి చెందిన 10కుక్కలను దగ్గర్లోని చెత్తకుండీల్లో విసిరేయడంతో వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత వరుసగా శంకర్‌పూర్ గ్రామంలోని తంగీ-చౌద్వార్ బ్లాక్ వద్ద వరుసగా కుక్కలు చచ్చిపడి కనిపించాయి. విషయం పోలీసుల వరకూ వెల్లడంతో ఆ వ్యక్తిని నిలదీసి ప్రశ్నించారు.

విచారణలో కుక్కలకు విషమిచ్చి చంపాడని తెలిసంది. తాను కుక్కల అరుపులకు, గోలకు విసిగిపోయానని అందుకే విషమిచ్చి చంపానని పోలీసులకు చెప్పాడు. పలు సెక్షన్ల ప్రకారం.. జంతువులపై క్రూరంగా ప్రవర్తించినట్లు పేర్కొని అతనిపై కేసులు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరిపేందుకు శాంపుల్స్ ను ఫోరెన్సిక్ పరీక్ష చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.