పూరీ రత్న భాండాగారంలో బయటపడిన భారీ విగ్రహాలు.. నల్లగా మారిపోయాయి

11మంది సభ్యుల బృందం 5 రోజుల వ్యవధిలో రెండోసారి రత్న భండార్ ను తెరిచింది. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల తరలింపు.

పూరీ రత్న భాండాగారంలో బయటపడిన భారీ విగ్రహాలు.. నల్లగా మారిపోయాయి

Updated On : July 18, 2024 / 4:39 PM IST

Puri Jagannath Temple Ratna Bhandar : పూరీ రత్న భాండాగారంలో భారీ విగ్రహాలు బయటపడుతున్నాయి. చాలా కాలం గడవటంతో లోహ విగ్రహాలు నల్లగా మారిపోయాయి. విగ్రహాలకు దీపాలు వెలిగించి హారతులు ఇచ్చారు కమిటీ సభ్యులు. బయటపడిన విగ్రహాల విలువ లెక్కిస్తామని కమిటీ సభ్యులు చెబుతున్నారు.

రత్న భండార్ లోని ఆభరణాలు, విలువైన వస్తువులను సాయంత్రంలోగా తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించే అవకాశం ఉందన్నారు పూరీ గజపతి మహారాజ్ దివ్య సింగ్ తేజ్. ఇవాళ రత్న భండార్ ను సందర్శించిన ఆయన.. రహస్య గదిలో ఉన్న అంతర్గత పరిస్థితిని సమీక్షించారు. శ్రీ జగన్నాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో కూడిన 11మంది సభ్యుల బృందం 5 రోజుల వ్యవధిలో రెండోసారి రత్న భండార్ ను తెరిచింది. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రత్న భండార్ పగుళ్లను పూర్తిగా మరమ్మత్తు చేసిన తర్వాతే స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం పనులు జరుగుతాయన్నారు.

Also Read : కల్పితం కాదు, రామసేతు వారధి వాస్తవ నిర్మాణమే.. ఏళ్ల నాటి రహస్యాన్ని వెలుగులోకి తెచ్చిన ఇస్రో