Pawan Kalyan: కలిసి పోరాడదాం.. బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కల్యాణ్

బంగ్లాదేశ్ లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు.

AP Deputy CM Pawan Kalyan

Chinmoy krishna Das Arrest: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మోయ్ కృష్ణదాస్ ను ఢాకా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఢాకా విమానాశ్రయంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేయగా.. అక్కడి న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, కృష్ణదాస్ అరెస్టును భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కృష్ణదాస్ ను అరెస్టు చేసి, బెయిల్ నిరాకరించడంపై ప్రభుత్వ విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దాస్ అరెస్టు విషయంలో బంగ్లాదేశ్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్లు తెలిపింది. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ తెలిపారు.

Also Read: Ram Gopal Varma: నేనేమీ భయపడటం లేదు.. వీడియో విడుదల చేసిన ఆర్జీవీ.. సంచలన వ్యాఖ్యలు

చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. ‘ఎక్స్’ వేదికగా పవన్ స్పందించారు. దీనిపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. పవన్ ట్వీట్ ప్రకారం.. ‘హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తమను తవ్రంగా కలచివేస్తోంది. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. బంగ్లాదేశ్ ఏర్పాటుకోసం భారత సైన్యం రక్తం చిందించింది. దేశ వనరులు ఖర్చవడంతోపాటు మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యునైటెడ్ నేషన్ స్పందించాలని పవన్ కోరారు. చిన్మోయ్ అరెస్టును ఖండిస్తూ ఏఎన్ఐతో శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడిన వీడియోను పవన్ తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.