Pawan Kalyan: తమిళనాడు మధురైలో మురుగన్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువు హిందువుగా ఉండకూడదా అని ప్రశ్నించారు. హిందువుల దేవుళ్లను అవమానిస్తున్నారని, అదేంటని ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటున్నారని మండిపడ్డారు. హిందువుల దేవుళ్లను అవమానించిన వారికి తగిన శాస్తి తప్పదంటూ హెచ్చరించారు పవన్ కల్యాణ్.
మానాడుపై రాజకీయాలు చేయడం తగదని పవన్ హితవు పలికారు. దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టకండి అని పవన్ అన్నారు. మేము శాంతంగా ఉన్నామని మమ్మల్ని అసమర్థులు అనుకోవద్దన్నారు పవన్ కల్యాణ్. మానాడులో కీలక నిర్ణయం తీసుకుందాం, హిందువులను అవమానించే వారికి మనమేంటో చూపిద్దాం అని పవన్ అన్నారు.
”మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరు? హిందువు హిందువుగా ఉండకూడదా? దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. అవమానిస్తారు.. ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారు. మా దేవుడిని అవమానించిన వారికి తగిన ఫలితం అనుభవించక తప్పదు” అని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.