Reliance Scholarships : ఒక్కొక్కరికి రూ.6లక్షలు.. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్… అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. దేశంలో టెక్నాలజీ లీడర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్న రిలయన్స్.. ఇందులో భాగంగా..

Reliance Scholarships : రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. దేశంలో టెక్నాలజీ లీడర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్న రిలయన్స్.. ఇందులో భాగంగా ప్రతిభావంతమైన విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ లు ఇస్తోంది. దీనికి సంబంధించి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. దేశంలోని 100 మంది ప్రతిభ గల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తించి వారికి గ్రాంట్ ఇస్తుంది. సామాజిక మంచి కోసం వారి నైపుణ్యాలను పెంపొందించే బలమైన అభివృద్ధి కార్యక్రమంతో గుర్తించి మద్దతిస్తుంది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్స్ దేశ సాంకేతిక వృద్ధికి తోడ్పడుతారు.

Mustard Oil : ఆవ నూనెతో వంట…బరువు తగ్గటం సులువు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ /లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న విద్యార్థులు దీనికి అర్హులు. మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.

Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ల ద్వారా 60 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.4 లక్షలు, 40 మంది వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు వారి డిగ్రీ కాలానికి స్కాలర్ షిప్ గా ఇస్తుంది. ఇది సామాజిక ప్రయోజనాల కోసం సాంకేతికత వైపు విద్యార్థులకు మద్దతిచ్చే లక్ష్యంతో కార్పొరేట్ ఫౌండేషన్ ద్వారా అవార్డు విలువలో అతిపెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటిగా నిలిచింది. దీని ద్వారా విద్యార్థులు విలువైన అవకాశాలు పొందుతారు. ప్రముఖ ప్రపంచ నిపుణులతో సంభాషించే అవకాశం లభిస్తుంది. అలాగే మార్గదర్శకత్వం, ఇంటర్న్‌షిప్‌లు, వాలంటీరింగ్, బలమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ పొందుతారు.

ట్రెండింగ్ వార్తలు