University of Madras : మద్రాస్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. యూజీసీ లేదా సీఎ్‌సఐఆర్‌ నెట్‌,స్లెట్‌,సెట్‌ అర్హత కలిగి ఉండాలి.

University of Madras

University of Madras:చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ ఒప్పంద ప్రాతిపదికన దూర విద్యా విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 61ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎకనామిక్స్‌, హిస్టరీ, కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సైకాలజీ, ఇంగ్లీష్‌, పొలిటికల్‌ సైన్స్‌, మ్యూజిక్‌, సైబర్‌ ఫోరెన్సిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. యూజీసీ లేదా సీఎ్‌సఐఆర్‌ నెట్‌,స్లెట్‌,సెట్‌ అర్హత కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.30,000 జీతభత్యాలు చెల్లిస్తారు. ఎంపిక విధానం విషయానికి వస్తే షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తలను ఆఫ్‌లైన్‌ ద్వారా అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందించాల్సిన చిరునామా: ద రిజిస్ట్రార్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, చెపౌక్‌, చెన్నై- 600 005, దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 05 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.unom.ac.in/#homeసంప్రదించగలరు.