అసలు మీరు మంత్రేనా? : రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఫైర్ 

  • Publish Date - November 22, 2019 / 01:08 PM IST

రాజ్యసభలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీవాసులకు నాణ్యమైన నీటిని అందించే విషయంలో రభస చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్ నేతల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది.

ఇరు పార్టీల సభ్యులను ఎంతగా వారించిన వినకపోవడంతో సభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఫైర్ అయ్యారు. జీరో ఓవర్‌లో బీజేపీ నేత విజయ్ గోయెల్ ఢిల్లీలో నీటి నాణ్యతపై లేవనెత్తారు. నీటి నాణ్యత సరిగా లేదని, సురక్షితం కాదని అన్నారు. దీనికి ఆప్ నేత సంజయ్ సింగ్ పెద్దగా అరుస్తూ కౌంటర్ ఎటాక్ చేశారు. దీనిపై సభాలో వెంకయ్య సంజయ్ సింగ్ ను వారించారు. 

ఒక వ్యక్తి లేదా ప్రభుత్వంపై సభలో ఆరోపణలు చేయొద్దని దయచేసి కూర్చొవాలని ఆయన ఆదేశించారు. కానీ, సంజయ్ అలానే ఆరోపించడంతో వెంకయ్య సీరియస్ అయ్యారు. ‘అసలు మీరు మంత్రేనా? అంటూ సంజయ్ సింగ్ పై వెంకయ్య మండిపడ్డారు. నీటి నాణ్యతపై ఎలాంటి కథనాలైనా పత్రికల్లో చూశారంటూ విజయ్ గోయెల్ ను వెంకయ్య ప్రశ్నించారు.

ఎయిర్ ప్యూరిఫైయర్స్, వాటర్ వాటిల్స్ లేదా పొల్యుషన్ మాస్క్ సభలో అనుమతి లేదని అన్నారు. సభలో చర్చ కొనసాగుతుండగా బీజేపీ నేత గోయెల్.. ఢిల్లీలో పొల్యుషన్ కు సంబంధించిన పత్రిక కథనాలను ప్రదర్శించారు. సభ నియమ నిబంధనలను అందరూ అనుసరించాలని, వెంకయ్య సభలోని సభ్యులకు సూచించారు. 

ట్రెండింగ్ వార్తలు