Army Jawan Killed In Encounter With Terrorists
Army jawan killed in encounter with terrorists : జమ్ము కశ్మీర్ పరిధిలో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో..చోటు చేసుకుంటున్న కాల్పుల్లో జవాన్లు వీరమరణం పొందుతున్నారు.
తాజాగా..పుల్వామా జిల్లాలోని Hanjin గ్రామంలో ఉన్న Rajporaలో ఉగ్రవాదులు దాక్కొన్నారని భధ్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో 2021, జూలై 02వ తేదీ శుక్రవారం కూంబింగ్ నిర్వహించారు. పుల్వామా పోలీసులు, CRPF సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరి కదలికలను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
దీంతో భారత బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఇరుపక్షాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సమాచారం. జమ్ము కశ్మీర్..కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో గురువారం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రత బలగాలు. గత ఆరు నెలల కాలంలో ఎన్ కౌంటర్లలో 61 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం.