కశ్మీర్ లోయలో మూతపడ్డ స్కూళ్ల సంఖ్యను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూతపడిన స్కూళ్లను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
బెంగుళూరులో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ…స్కూళ్లు మాత్రమే కాకుండా కశ్మీర్ లో ఏళ్లుగా సుమారు 50 వేల ఆలయాలను మూసివేశారని, అందులో కొన్నింటిని ధ్వంసం చేయడం,విగ్రహాలను విరగగొట్టబడటం జరిగిందని ఆయన తెలిపారు. ధ్వంసమైన ఆలయాల వివరాలను కూడా సేకరించనున్నట్లు తెలిపారు. మూతపడ్డ ఆలయాల సమాచారాన్ని తెలుసుకునేందుకు సర్వేకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.