Viral Video : 20 కేజీల బిస్కెట్లతో అయోధ్య రామ మందిర ప్రతిరూపం.. ఔరా అనిపిస్తోంది

అయోధ్య రామ మందిర ప్రతిరూపాన్ని ఆర్టిస్టులు తమదైన శైలిలో ప్రదర్శిస్తున్నారు. బిస్కెట్లతో రామ మందిర ప్రతిరూపాన్ని తయారు చేసాడు ఒక ఆర్టిస్టు.

Viral Video

Viral Video : జనవరి 22 న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌కి చెందిన ఓ యువకుడు 20 కేజీల బిస్కెట్స్ ఉపయోగించి అయోధ్య రామ మందిర ప్రతిరూపాన్ని తయారు చేసారు. ఈ బిస్కెట్స్‌తో తయారు చేసిన రామ మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌ నుంచి యాత్రగా అయోధ్యకు 1,265 కిలోల లడ్డు

వెస్ట్ బెంగాల్‌కి చెందిన చోటన్ ఘోష్ అనే ఆర్టిస్ట్ 20 కేజీల పార్లే జీ బిస్కెట్స్ ఉపయోగించి అయోధ్య రామ మందిర ప్రతిరూపాన్ని తయారు చేసారు. తన స్నేహితుల సాయంతో ఇది తయారు చేయడానికి ఐదురోజుల సమయం పట్టిందట. బిస్కెట్స్‌తో పాటు థర్మోకపుల్స్, ఫ్లైవుడ్, గ్లూ-గన్ ఇందుకోసం ఉపయోగించారట. చోటన్ ఘోష్ గతంలో కూడా ఇలాంటి అనేక ప్రతిరూపాలను తయారు చేసారట. ప్రస్తుతం బిస్కెట్స్‌తో తయారు చేసిన అయోధ్య రామ మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ayodhya Temple : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు ప్రారంభం.. ఏ రోజు.. ఏ కార్యక్రమం నిర్వహిస్తారంటే?

దశాబ్దాల నిరీక్షణకు తెర తీస్తూ జనవరి 22 న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న ఈ వేడుకను కళ్లారా చూడటానికి అనేకమంది భక్తులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రోటోకాల్స్‌ను ఫాలో అవుతూ మధ్యాహ్న వేళ అభిజిత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది.