Arvind Kejriwal meditation: “దేశం కోసం ప్రార్థన”… 7 గంటలు ధ్యానం చేసిన సీఎం కేజ్రీవాల్

"దేశం కోసం ప్రార్థన" అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ 7 గంటల పాటు ధ్యానం చేశారు. తెల్ల దుస్తులు ధరించి ఆయన ధ్యానంలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా హోలీ జరుపుకోబోమని కేజ్రీవాల్ చెప్పారు.

Arvind Kejriwal meditation: “దేశం కోసం ప్రార్థన” అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ 7 గంటల పాటు ధ్యానం చేశారు. తెల్ల దుస్తులు ధరించి ఆయన ధ్యానంలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా హోలీ జరుపుకోబోమని కేజ్రీవాల్ చెప్పారు.

ఢిల్లీ మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10 గంటలకు ధ్యానంలో కూర్చునే ముందు రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి కేజ్రీవాల్ నివాళులు అర్పించారు. మంచి పనులు చేస్తున్నందుకు నేతలను బీజేపీ అరెస్టు చేయిస్తోందని కేజ్రీవాల్ నిన్న కూడా ఆరోపించారు.

దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, దేశం కోసం ప్రార్థన చేస్తానని చెప్పారు. సిసోడియా, జైన్ ను జైల్లో ఉంచారని, అదానీపై మాత్రం ఏ చర్యా తీసుకోవడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రధాని మోదీ తప్పుడు చర్యలకు పాల్పడుతున్నట్లు అనిపిస్తే ప్రజలు కూడా “దేశం కోసం ప్రార్థన” చేయాలని కేజ్రీవాల్ కోరారు.

BJP-NCP: విపక్షాలకు షాకిస్తూ బీజేపీతో చేతులు కలిపిన శరద్ పవార్.. అంతటా శత్రువులమే కానీ అక్కడ కాదంటూ కామెంట్

ట్రెండింగ్ వార్తలు