Arvind Kejriwal : దేశం మొత్తం ఇంక్విలాబ్ రావాలి.. పంజాబ్‌‌కు స్వాతంత్రం వచ్చింది..

దేశం మొత్తం బ్రిటీష్ లాంటి పరిపాలన కొనసాగుతోందని, ప్రస్తుతం వ్యవస్థలను మార్చేపని ఆప్ చేస్తుందన్నారు. పెద్ద పెద్ద నేతలంతా కలిసి ఈ దేశం ముందుకెళ్లకుండా...

Punjab Election 2022 : భారతేదేశం మొత్తం ఇంక్విలాబ్ రావాలన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్. పంజాబ్ కు స్వాతంత్ర్యం వచ్చిందని..భవిష్యత్ లో యావత్ దేశానికి స్వాతంత్ర్యం వస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు మార్చడానికి ప్రతొక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ కు అధికారం కట్టబెట్టినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతొక్కరూ ఆప్ పార్టీలో చేరి దోపిడికి గురవుతున్న భారతదేశాన్ని కాపాడాలని సూచించారు.

Read More : Assembly Election Results 2022 : పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి..

పంజాబ్ రాష్ట్రంలో కొత్త చరిత్ర : –
పంజాబ్ రాష్ట్రంలో ఆప్ కొత్త చరిత్ర సృష్టించింది. సీఎం పీఠంపై ఆప్ నేత భగవంత్ మాన్ కూర్చొన్నారు. కాంగ్రెస్ ను కేజ్రీవాల్ టీం ఊడ్చిపారేసింది. మొత్తం 117 సీట్లున్న పంజాబ్ లో ఆప్ ఏకంగా 91 స్థానాల్లో అధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. విజయం సాధించడం పట్ల సీఎం కేజ్రీవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పంజాబ్ లోని ప్రజలు అత్యద్భుతం చేసి చూపించారని వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. కొన్ని సంవత్సరాలుగా బ్రిటీష్ కాలం నాటి పద్ధతులను అవలింబ చేస్తున్నారని విమర్శించారు.

Read More : AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్

వ్యవస్థను మార్చాల్సిందే : –
బ్రిటీష్ వాళ్లను తరిమితే సరిపోదని, వ్యవస్థను మార్చాలని ఆనాడు భగత్ సింగ్ చెప్పిన విషయాలను ఆయన గుర్తు చేశారు. దేశాన్ని దోచేస్తున్నారని, ఎలాంటి ఆసుపత్రులు, విద్యాలయాలు నిర్మాణం చేయకుండా.. ప్రజలను దోచుకున్నారని తెలిపారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో బాదల్, చన్నీ, కెప్టెన్ కూడా ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. చరణ్ జీత్ చన్నీ సింగ్ ను ఎవరు ఓడించారని ప్రశ్నించారు. మొబైల్ రిపేర్ దుకాణంలో చిన్న పని చేస్తున్న ఓ వ్యక్తి ఓడించారన్నారు. అలాగే సిద్ధూను ఓడించిన వ్యక్తి మహిళా వాలంటీర్ అని ప్రజలకు తెలిపారు. దేశం మొత్తం బ్రిటీష్ లాంటి పరిపాలన కొనసాగుతోందని, ప్రస్తుతం వ్యవస్థలను మార్చేపని ఆప్ చేస్తుందన్నారు. పెద్ద పెద్ద నేతలంతా కలిసి ఈ దేశం ముందుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

Read More : Punjab : భలే..భలే..త్వరలో ఎన్నికల ఫలితాలు..పంజాబ్ లో లడ్డూలకు ఫుల్ డిమాండ్..భారీగా ఆర్డర్ల వెల్లువ..

ఆప్ పార్టీ రాకుండా కుత్రంతాలు, కుట్రలు : –
తమ పార్టీ ఎలాంటి అవినీతి లేకుండా పాలన చేయడం జరిగిందని, చిన్న పిల్లలకు స్కూళ్లు ఏర్పాటు చేశామని, పేదల చిన్న పిల్లల చదువుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా చాలా మంది ప్రయత్నించారని, చాలా కుతంత్రాలు చేశారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ అభివర్ణించారని, కానీ..అలాంటి వ్యక్తిని తాను కాదని ప్రజలు నిరూపించారన్నారు. భారతదేశాన్ని దోపిడి చేస్తున్న వారంతా ఉగ్రవాదులని విమర్శించారు. ఒక కొత్త భారతదేశాన్ని నిర్మాణం చేయాలని, ప్రతొక్క వ్యక్తి ప్రేమానురాగాలతో ఉండాలని తెలిపారు.

Read More : 5 State Assembly Election Results 2022 Live : 4 రాష్ట్రాల్లో బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. పంజాబ్‌ను ఊడ్చేసిన కేజ్రీవాల్

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయము : –
పేదల పిల్లలకు ఉన్నతమైన విద్య రావాలని, ఇన్ని సంవత్సరాలైనా మెడికల్ విద్య కోసం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. దీనిని మార్చాల్సిన అవసరం ఉంటుందని, మెడికల్ చదువు కోసం ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు. యువత, మహిళలు, కిసాన్, ఇతర కార్మికులు, ఉద్యోగులు ఆప్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భగవంత్ మాన్ కు అభినందనలు తెలియచేస్తున్నామన్నారు. పార్టీపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి వమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. ఆప్ కార్యకర్తలు ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని సూచించారు సీఎం కేజ్రీవాల్.

ట్రెండింగ్ వార్తలు