AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్

పార్టీ ఆవిర్భావం నుంచి.. ఢిల్లీ మినహా ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది

AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్

Aap

AAP in Punjab: దేశంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా చెప్పుకునే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. కేంద్రంలోనూ అదే పార్టీ పీఠాన్ని చేజిక్కిచ్చుకుంటుందనే సెంటిమెంట్ నడుమ..ఓటర్ల తీర్పు ఏకపక్షంగా సాగినట్లు తెలుస్తుంది. ఒక్క పంజాబ్ మినహా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అధికార బీజేపీ.. మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం రెండంకెల స్థానాలను కూడా బీజేపీ అందుకోలేదు. ఒక్క బీజేపీనే కాదు..అధికార కాంగ్రెస్ కూటమి, ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం పంజాబ్ లో కనుమరుగయ్యాయి. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. పంజాబ్ లో “ఆమ్ ఆద్మీ పార్టీ” జెండా ఎగురవేసింది.

పార్టీ ఆవిర్భావం నుంచి.. ఢిల్లీ మినహా ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఇంతలా ఆమ్ ఆద్మీ పంజాబ్ లో ఆధిపత్యాన్ని ఎలా ప్రదర్శించగలిగింది?. కేజ్రీవాల్ కు కలిసొచ్చిన అంశాలు ఏమిటి?. రానున్న రోజుల్లో ఓటర్ నాడీ మారుతుందా?. పంజాబ్ ఫలితాలను విశ్లేషించుకుంటే..రైతు చట్టాలు సహా మహిళలకు ప్రాధాన్యత వంటి అనేక అంశాలు కేజ్రీవాల్ కు కలిసొచ్చాయనే చెప్పాలి. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ మంత్రాకు కలిసొచ్చిన అంశాలు ఏమిటంటే..

Also read:Modi- Yogi : యూపీలో చరిత్ర తిరగరాసిన బీజేపీ.. మోదీ-యోగీ డబుల్ ధమాకా

రైతు చట్టాలు, ఢిల్లీలో రైతులకు కేజ్రీవాల్ మద్దతు
2019 సర్వత్ర ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారం కొనసాగించిన బీజేపీ ప్రభుత్వం.. మూడు రైతు చట్టాలను ప్రవేశపెట్టింది. అయితే ఈ చట్టాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. రైతుల కడుపుకొట్టి కార్పొరేట్ కు వత్తాసు పలికేలా రైతు చట్టాలు ఉన్నాయంటూ రైతులు రైతు సంఘాలు తీవ్ర నిరసనకు దిగారు. పంజాబ్ హరియాణా నుంచి వేలాదిగా రైతులు.. రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్దకు చేరుకొని బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. అయితే రైతుల నిరసనను పెద్దగా పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం..అవి తమకు ఎంత వ్యతిరేకత చేకురుస్తుందనే విషయాన్నీ అంచనా వేయలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతుల నిరసనను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకుని నిరసన తెలుపుతున్న రైతులకు కేజ్రీవాల్ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రైతులకు అవసరమైన ఆహారం, నీరు వంటి సకల సౌకర్యలు సమకూర్చి కేంద్రంపై ఎగదోసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. దీంతో రైతులు తాము అనుకున్న దానికంటే మరో ఏడు నెలలు నిరంతరాయంగా.. ఢిల్లీ సరిహద్దుల వద్ద భైఠాయించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కొనసాగించారు.

Also read: Punjab CM Charanjit Singh: రాజీనామాకు సిద్ధమైన పంజాబ్ సీఎం

అయితే తమ ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకతను ఆలస్యంగా అంచనా వేసిన మోదీ ప్రభుత్వం.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మూడు నెలల ముందు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ ఆ ప్రకటన బీజేపీకి కలిసిరాలేదు. ఇక్కడ రైతుల సమస్య తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ అనుకుంది. రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడం తమకు ప్లస్ అవ్వొచ్చని బీజేపీ అనుకుంది. ఐతే.. గతంలో కాంగ్రెస్ తో కలిసి అధికారం ఏర్పాటుచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..సైలెంట్ గా తన పని కానిచ్చేసింది. పంజాబ్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్.. ముందు నుంచి జాగ్రత్త వహిస్తూ..ప్రచారం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం పోలీసులతో రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా… తనకు, హోంశాఖకు సంబంధం లేదని తన మీదకు వ్యతిరేకత రాకుండా చూసుకున్నాడు కేజ్రీవాల్. పంజాబ్ రైతులు, రైతు సంఘాల నేతలతో నిరంతరం టచ్ లో ఉన్న కేజ్రీవాల్..అది తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

Also read: Punjab Election Results 2022: పంజాబ్ లో టాప్ లేపుతున్న ‘ఆప్’..స్థానిక పార్టీలను ఊడ్చిపారేస్తోంది

యువత, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన “ఆప్”:

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకి కలిసొచ్చిన మరో అంశం యువత మరియు మహిళలు. గత 70 ఏళ్లుగా వివిధ పార్టీలను ఆదరించినా రాష్ట్రంలో మహిళలకు యువతకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఈసారి కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్న మహిళా ఓటర్లకు ‘ఆమ్ ఆద్మీ’కి అవకాశం ఇచ్చారు. యువత మరియు మహిళా ఓటర్ల నుండి AAPకి సంపూర్ణ మద్దతు లభించింది. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తానని కేజ్రీవాల్ చేసిన వాగ్దానం “వ్యవస్థను మార్చడానికి” ఆసక్తి ఉన్న యువకులను ఆకర్శించింది. రాష్ట్రంలో విద్య, ఉపాధికి హామీ ఇచేలా పార్టీలు సిద్ధం చేసిన మ్యానిఫెస్టోను ప్రజలు ఆసక్తిగా గమనించారు. అదేవిధంగా, రాష్ట్రంలోని మహిళల ఖాతాలలో నెలకు రూ. 1,000 జమ చేస్తానని కేజ్రీవాల్ ఇచ్చిన వాగ్దానం మహిళలకు నచ్చింది. దీంతో మహిళల ప్రత్యేక ఓటు బ్యాంకును కేజ్రీవాల్ ఆకర్షించాడు. రాష్ట్రంలో మిగతా పార్టీలేవీ ఇలా యువత, మహిళల కోసం ప్రత్యేక వాగ్దానాలు చేయలేదు సరికదా.. కనీసం వారి గురించి పట్టించుకోనూ లేదు. దీంతో ఈ అంశం కూడా కేజ్రీవాల్ కు కలిసొచ్చిందనే చెప్పాలి.

Also read: Punjab AAP CM Candidate: పంజాబ్ సీఎం అభ్యర్థి ఇంట్లో జిలేబీలతో సంబరాలు

ముఖ్యమంత్రిగా భగవంత్ మన్:
రాజకీయాల్లోకి రాకముందు సినిమాలు, టీవీల ద్వారా భగవంత్ మన్‌ పంజాబ్ ప్రజలకు సుపరిచితుడు. భగవంత్ మన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం వల్ల పార్టీకి ప్రత్యర్థులు పెట్టిన “బయటి వ్యక్తి” ట్యాగ్‌ తొలగిపోయింది. తన రాజకీయ మరియు సామాజిక వ్యంగ్య కథనాలతో పంజాబీల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు మన్. ఇతర సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కాకుండా.. ఎంతో నిరాడంబరంగా, ఒదిగి ఉండే తత్త్వం కలిగి ఉంటాడు. జీవితంలో నిలదొక్కుకుంటున్న రోజుల్లో తాను అద్దె ఇంట్లో ఎలా నివసించాడో ప్రతిసారి గుచ్చి గుచ్చి వివరించేవాడు భగవంత్ మన్. దీంతో ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకున్నాడు భగవంత్ మన్.
భగవంత్ సింగ్ మన్… 2014లో ఆప్ లో చేరి.. 2019 ఎంపీ ఎన్నికల్లో పంజాబ్ కు ఒకే ఒక ఆప్ ఎంపీగా గెలుపొందాడు. అతడినే సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించి ఆమ్ ఆద్మీ పార్టీ పేరుకు సార్ధకత తీసుకొచ్చాడు. దీంతో ఓటర్లు కూడా ఆమ్ ఆద్మీకి పట్టం కట్టారు.

Also read: Manipur Election Results 2022: మణిపూర్‌లో మళ్లీ కమలం వికసిస్తుందా?… హస్తం హవా చూపిస్తుందా

అయితే గతంలో పంజాబ్ లో అట్టడుగు స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇపుడు ఏకంగా అధికారాన్ని ఏర్పాటు చేసేలా మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం పై రాజకీయ విశ్లేషకులు భిన్నరకాలుగా స్పందింస్తున్నారు. ఓటరు నాడీ మారుతుందా అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం లేదని..కేవలం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ విజయాన్ని విశ్లేషించలేమని భావిస్తున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అధికార పార్టీపై వ్యతిరేకతను అదును చూసి కేజ్రీవాల్ తనకు అనుకూలంగా మార్చుకోవడంతోనే ఇది సాధ్యమైందని రాజకీయ పండితులు అంటున్నారు. ఒక్క పంజాబ్ తప్ప ఆప్ పోటీ చేసిన ఏ రాష్ట్రంలోనూ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదని విశ్లేషకులు అంటున్న మాట.